ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 17 డిశెంబరు 2020 (11:44 IST)

ఐకూ యూ3 5జీ పేరిట కొత్త స్మార్ట్ ఫోన్.. ధర రూ.19,100

IQ U3 launch
వివో సబ్ బ్రాండ్ ఐకూ తన కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. అదే ఐకూ యూ3 5జీ. ఇందులో 6.58 అంగుళాల డిస్ ప్లేను అందించారు. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ 5జీ ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. దీనికి సంబంధించిన ప్రీ సేల్ చైనాలో ఇప్పటికే ప్రారంభం అయింది. ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. 
 
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,498 యువాన్లుగా(సుమారు రూ.16,800) ఉండగా, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,698 యువాన్లుగా (సుమారు రూ.19,100) ఉంది.
 
గ్లో బ్లూ, ఎర్లీ బ్లాక్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించిన సేల్ చైనాలో డిసెంబర్ 18వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. మనదేశంలో ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు. ఇందులో 6.58 అంగుళాల ఎల్సీడీ డిస్ ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది.