శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 21 ఆగస్టు 2015 (14:47 IST)

వ్యక్తిగత సెర్చ్ ఇంజిన్‌తో గూగుల్ అథారిటీకి సవాల్: 16 ఏళ్ల అన్మోల్ అదుర్స్!

భారత సంతతికి చెందిన కెనడియన్ పౌరుడైన అన్మోల్ అనే పదో తరగతి బాలుడు ఓ వ్యక్తిగత సెర్చ్ ఇంజిన్‌ను రూపొందించి.. అంతర్జాలంలో సెర్చ్ ఇంజిన్లకు రారాజు గూగుల్‌కు సవాల్ విసిరాడు. తన వ్యక్తిగత సెర్చ్ ఇంజిన్ గూగుల్ కంటే 47 శాతం నిర్దిష్టమైందని, సగటున 21 శాతం మరింత కచ్చితమైందని గూగుల్ అథారిటీకి అన్మోల్ గుర్తు చేశాడు. 
 
16 ఏళ్ల అన్మోల్ కొన్ని రోజుల క్రితం ఇంటర్న్ షిప్ కోసం బెంగళూరు వచ్చాడు. అప్పడే గూగుల్ గురించి తెలుసుకుంటూనే వ్యక్తిగత సెర్చ్ ఇంజిన్‌ను అన్మోల్ డిజైన్ చేశాడు. ఇంకా సెర్చ్ ఇంజిన్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేశాడు.. అందులో సక్సెస్ అయ్యాడు. 
 
ఈ సెర్చ్ ఇంజిన్ రూపకల్పన కోసం అన్మోల్ దాదాపు 60 గంటల కోడ్ తీసుకున్నాడు. అంతేగాకుండా ఈ తతంగమంతా 13 నుంచి 18 ఏళ్ల విద్యార్థుల కోసం నిర్వహించిన గూగుల్ సైన్స్ ఫెయిర్ సబ్ మిషన్ పోటీలో భాగంగా చేశాడని తెలిసింది.