బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 21 జులై 2021 (15:31 IST)

పేరు మార్చుకొని రానున్న యాప్‌?

దేశంలో మంచి పాపులర్ అయిన వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్. ఇండో - చైనా సరిహద్దుల్లో ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాకు చెందిన అనేక యాప్‌లపై కేంద్రం నిషేధం విధించింది. అలాగే, టిక్ టాక్ వల్ల యూజర్ల వ్యక్తిగత భద్రతకు హాని ఉందని తేలడంతో కేంద్రం నిషేధం విధించింది. అయితే, ఇపుడు పేరు మార్చుకొని మళ్లీ భారత్‌లోకి రానున్నట్టు తెలుస్తుంది. 
 
టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌ డ్యాన్స్‌ ఈ యాప్‌ పేరును ticktockగా మార్చి భారత్‌లో అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నది. ఈ పేరుకు పేటెంట్‌ కోసం భారత్‌లో కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ పేటెంట్స్‌కు దరఖాస్తు చేసుకొన్నట్టు టెక్‌ మాస్టర్‌ ముకుల్‌ శర్మ ట్వీట్‌ చేశారు. 
 
 
ఈ నెల 6వ తేదీనే బైట్‌ డ్యాన్స్‌ దరఖాస్తు చేసుకొన్నట్టు తెలిపారు. అయితే దీనిపై బైట్‌ డ్యాన్స్‌ ఎలాంటి ధ్రువీకరణ ఇవ్వలేదు. చైనాతో వివాదాలు, భద్రతా కారణాల దృష్ట్యా భారత్‌ టిక్‌టాక్‌పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.