హిజ్రాలను గౌరవించే దిశగా వాట్సాప్‌లో కొత్త ఎమోజీ..

Last Updated: శనివారం, 23 మార్చి 2019 (16:02 IST)
సోషల్ మీడియాలో అగ్రగామి అయిన వాట్సాప్‌లో కొత్త ఎమోజీ వచ్చింది. ఆండ్రాయిడ్ ఫోన్‌లలో హిజ్రాలను గౌరవించే రీతిలో హిజ్రా ఎమోజీ వచ్చేసింది. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌లను ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ వున్న వారు వాట్సాప్ తప్పనిసరిగా వినియోగిస్తున్నారు.


ఈ నేపథ్యంలో వాట్సాప్ కస్టమర్లను పెంచుకునేందుకు గాను కొత్త కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగానే తాజాగా హిజ్రాలను గౌరవించే దిశగా హిజ్రా ఎమోజీని యాడ్ చేసినట్లు వాట్సాప్ వెల్లడించింది.  
 
వాట్సాప్ ఆఫ్ బీటా ఫీచర్‌లో ఈ ఎమోజీ చేర్చడం జరిగింది. ఈ ఫీచర్ వాట్సాప్ బీటా ఆండ్రాయిడ్ బీటా 2.19.56 వర్షన్‌‌లో వుంది. ఇంకా బీటా 2.19.73 వర్షన్‌లోనూ ఇది అందుబాటులో వుంటుంది.

దీనితో పాటు ఫోటోలను వెతికే రీతిలో సర్చ్ బై ఇమేజ్ ఫీచర్ కూడా త్వరలో రానుందని వాట్సాప్ ఓ ప్రకటన ద్వారా తెలిసింది. అంతేగాకుండా ఒకేసారి 30 ఆడియోలను షేర్ చేసే ఆప్షన్ కూడా రానుందని సమాచారం.దీనిపై మరింత చదవండి :