బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 17 నవంబరు 2022 (17:58 IST)

ఈ నెల 29 నుంచి ట్విట్టర్‌లో బ్లూటిక్ ... ఎలాన్ మస్క్ వెల్లడి

twitter deal elon musk
ట్విట్టర్ ఖాతాదారులకు ఆ సంస్థ అధిపతి ఎలాన్ మస్క్ శుభవార్త చెప్పారు. ఈ నెల 29వ తేదీ నుంచి బ్లూటిక్ సేవలను తిరిగి ప్రారంభమవుతాయని వెల్లడించారు. ట్విట్టర్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత ఎలాన్ మస్క్ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెల్సిందే. ఇందులో భాగంగా బ్లూటిక్‌కు చెల్లించే నెలవారి ఫీజును పెంచారు. 
 
దీంతో అనేక మంది అమెరికా పౌరులు అనేక నకిలీ ఖాతాల కోసం 8 డాలర్లు చెల్లించి బ్లూటిక్‌ను పొందారు. దీంతో ఇబ్బంది పడిన ట్విట్టర్ బ్లూ టిక్ సబ్‍‌స్క్రిప్షన్ సర్వీస్‌ను నిషేధించింది. అయితే, దీన్ని మరోమారు పునఃప్రాంభిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. తాత్కాలికంగా సస్పెండ్ చేసిన బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్ సేవలను ఈ నెల 29వ తేదీ నుంచి తిరిగి పునఃప్రారంభిస్తామని ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ వెల్లడించారు.