గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 6 జులై 2021 (10:49 IST)

Village Cookingకు కోటి మంది సబ్‌స్క్రైబర్లు.. అరుదైన రికార్డ్

Village Cooking Channel
పెద్ద నెట్ వర్క్స్.. జాతీయ స్థాయి ఛానెళ్లకు కూడా సాధ్యపడని ఓ అరుదైన రికార్డును ఓ రీజనల్ కుకింగ్ ఛానెల్ యూట్యూబ్ ఛానల్ సొంతం చేసుకొని సంచలనం సృష్టిస్తుంది. Village Cooking అనే ఓ యూట్యూబ్ ఛానెల్ మొదలుపెట్టిన మూడేళ్ళ కాలంలోనే ఏకంగా కోటి మంది సబ్ స్క్రైబర్లను సొంతం చేసుకొని అందరినీ షాక్‌కి గురిచేస్తుంది. తమిళ భాషలో కుకింగ్ వీడియోలు చేసే ఈ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు దేశవ్యాప్తంగా పేరు మార్మ్రోగిపోతుంది.
 
ఈ సంవత్సరం జనవరి నెలలో కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ ఈ ఛానెల్ తో కలిసి వంట చేసి సహపంక్తి భోజనం చేశారు. ఆ వీడియో భారీ స్థాయి వ్యూస్ రాబట్టింది. అదే సమయంలో కోటిమంది సబ్ స్క్రైబర్లను రాబట్టడంలో కూడా ఈ వీడియోలు ఈ ఛానెల్ నిర్వాహాలకు పెద్ద ప్లస్ అయ్యింది. 
 
ఒక్కమాటలో చెప్పాలంటే రాహుల్ గాంధీ మీట్ తర్వాత ఈ ఛానల్ పేరు​ దేశంలో మారుమోగిపోయింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ చేసిన ఈ వీడియోలతో Village Cooking Channel మళ్ళీ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.