ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 సెప్టెంబరు 2023 (17:54 IST)

భారతదేశంలో వీవో టీ2 ప్రో మోడల్ విడుదల

వీవో టీ2 ప్రో మోడల్ భారతదేశంలో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ మోడల్ ఫీచర్లను ఇక్కడ తెలుసుకుందాం. ఈ టీ2 ప్రో Vivo T2 సిరీస్‌లో 3వ మోడల్‌గా రానుంది. ఇప్పటికే Vivo T2 5G, Vivo T2X 5G స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి ఇది MediaTek డైమెన్షన్ 7200 SoC చిప్‌సెట్‌ని కలిగి ఉంది. ఇందులో రెండు వేరియంట్లు ఉండవచ్చని సమాచారం. అవి 8GB RAM, 128GB స్టోరేజ్, 8GB RAM – 256GB స్టోరేజ్.
 
ఈ Vivo T2 ప్రో మోడల్ Flipkartలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ. 23,999 ఉండవచ్చు. మార్కెట్లో లాంచ్ అయిన తర్వాత ఈ Vivo T2 ప్రో స్మార్ట్‌ఫోన్ IQOO Z7 Proకి గట్టి పోటీనిస్తుందని అంచనాలు ఉన్నాయి. దీని ధర దాదాపు రూ. 24 వేలు. ఈ మోడల్ ఫీచర్లు, ధర వంటి వివరాలపై కంపెనీ క్లారిటీ ఇవ్వలేదు.