వన్ ప్లస్ 7 ప్రో స్మార్ట్ ఫోన్ ప్రీ-బుకింగ్.. అమేజాన్‌లో కొనుగోలు చేస్తే?

Last Updated: మంగళవారం, 7 మే 2019 (13:38 IST)
వన్ ప్లస్ 7 ప్రో స్మార్ట్ ఫోన్ ప్రీ-బుకింగ్ ప్రారంభమైంది. అమేజాన్‌లో ఈ ఫోనును కొనుగోలు చేస్తే వెయ్యి రూపాయల విలువగల గిప్ట్ కార్డును పొందవచ్చు. ఈ ప్రీ-బుకింగ్ ద్వారా వన్ టైమ్ స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ఇన్సూరెన్స్ పొందవచ్చు. ఈ ఇన్సూరెన్స్ ఆరునెలల పాటు రూ.15వేల వరకు కవరవుతుంది. 
 
వన్ ప్లస్ 7 ప్రో స్మార్ట్ ఫోన్లను వన్ ప్లస్, క్రోమా, రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో లభిస్తాయి. వన్ ప్లస్ స్టోర్లలో బుక్ చేసుకునే వినియోగదారులు.. రూ.500 విలువ గల వౌచర్‌ను పొందవచ్చు. వన్ ప్లస్ 7 ప్రో ప్రీ-బుకింగ్ మే 8వ తేదీ నుంచి ఆఫ్ లైన్‌లో ప్రారంభమవుతుంది.దీనిపై మరింత చదవండి :