అక్టోబర్ నెలలోనే 20లక్షల వాట్సాప్ అకౌంట్స్ బ్యాన్
ఒక్క అక్టోబర్ నెలలోనే సరిగ్గా 20 లక్షల 69 వేల వాట్సాప్ అకౌంట్స్ బ్యాన్ అయ్యాయని వాట్సాప్ తెలిపింది. +91 అనే నెంబర్‌తో మొదలయ్యే నెంబర్స్ ఆధారంగా వాటిని ఇండియన్ వాట్సాప్ అకౌంట్స్‌గా గుర్తించినట్టు వాట్సాప్ స్పష్టంచేసింది.
వాట్సాప్ యూజర్స్ ప్రైవసీ, సేఫ్టీ కోసం వాట్సాప్ సంస్థ నిరంతరంగా కృషి చేస్తూనే ఉందని, అందులో భాగంగానే ఇలాంటి నిర్ణయాలు తీసుకోక తప్పదని తెలిపారు. ఐటి రూల్స్ 2021 ప్రకారం తాజాగా వాట్సాప్ ఇటీవలే అక్టోబర్ నెల నివేదికలు బహిర్గతం చేసినట్టు వాట్సాప్ తెలిపింది.
వాట్సాప్‌పై వేధింపులను నివారించడం కోసం ఆ సంస్థ ప్రపంచవ్యాప్తంగా నెలకు సగటున 8 మిలియన్ల మంది యూజర్ల అకౌంట్స్‌పై నిషేధం విధిస్తున్నట్టు వాట్సాప్ ప్రకటించింది.