శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 30 జూన్ 2017 (12:56 IST)

వాట్సాప్‌లో మరో ఫీచర్... ఎమోజీల కోసం సెర్చ్‌ ఆప్షన్‌...

సోషల్ మీడియా దిగ్గజాల్లో ఒకటైన వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. యూజర్లకు ఇప్పటికే అనేక ఫీచర్లను అందుబాటులో ఉంచిన వాట్సాప్.. ఇపుడు ఏదైనా భావాన్ని లేదా సమాచారాన్ని తెలుపడానికి ఎక్కువగా వాడే ఎమ

సోషల్ మీడియా దిగ్గజాల్లో ఒకటైన వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. యూజర్లకు ఇప్పటికే అనేక ఫీచర్లను అందుబాటులో ఉంచిన వాట్సాప్.. ఇపుడు ఏదైనా భావాన్ని లేదా సమాచారాన్ని తెలుపడానికి ఎక్కువగా వాడే ఎమోజీల కోసం సెర్చ్‌ ఆప్షన్‌ను తీసుకొచ్చింది. 
 
తాజా ఆండ్రాయిడ్‌ బిల్డ్‌లో యూజర్లు తమ సంభాషణల్లో అత్యంత వేగవంతంగా, సులభతరంగా ఎమోజీలను పంపడానికి ఈ సెర్చ్‌ ఆప్షన్‌ ఎంతగానో దోహదపడనుంది. ఇప్పటివరకు వాట్సాప్ యూజర్‌ తమకు కావాల్సిన ఎమోజీలను సైడ్‌ స్క్రోల్‌ చేస్తూ వెతుకునేవారు. కానీ  ఇప్పుడు ఆ అవసరం లేకుండా వాటికోసం సెర్చ్‌ ఆప్షన్‌ ప్రవేశపెట్టింది. ఇందులో తమకు కావాల్సిన ఎమోజీలను టైప్‌ చేస్తే చాలు వాటికి సంబంధించిన ఎమోజీలన్నీ మెసేజ్‌ టైప్‌ చేసే కిందకు వచ్చేస్తాయి. వాటిలో మనకు కావాల్సింది, సంభాషణలో ఉపయోగపడేది ఎంపికచేసుకోవచ్చు.  
 
అయితే, ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్‌ బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. అన్ని వెర్షన్లకు త్వరలోనే అందుబాటులోకి రానుంది. అంతేకాక తొలుత ఆండ్రాయిడ్‌ బీటా యూజర్లకు అందుబాటులోకి వచ్చిన వీడియో స్ట్రీమింగ్‌ ఫీచర్‌ కూడా ప్రస్తుతం ఐఫోన్‌ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌ ఇప్పటికే ఆండ్రాయిడ్‌ యూజర్లకు వాట్సాప్‌ రిలీజ్‌ చేసింది. రీకాల్‌ ఫీచర్‌ను కూడా లాంచ్‌ చేసేందుకు వాట్సాప్‌ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.