శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 నవంబరు 2022 (11:55 IST)

మార్కెట్‌లో విక్రయానికి ఉంచిన వాట్సాస్ యూజర్ల నంబర్లు

whatsapp
ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల మొబైల్ నంబర్లు ఇపుడు బహిరంగ మార్కెట్‌లో విక్రయానికి సిద్ధమయ్యాయి. యూజర్ల నంబర్లు లీక్ కావడం ఇపుడు వాట్సాప్ మాతృ సంస్థ మెటాలో కలకలం రేపుతోంది. దాదాపు 50 కోట్ల మంది యూజర్ల మొబైల్ ఫోన్ నంబర్లు ఆన్‌లైన్‌లో విక్రయానికి ఉంచినట్టు సైబర్ న్యూస్ నివేదిక బహిర్గతం చేసింది. వీటిలో అమెరికాతో పాటు పలు దేశాలకు చెందిన యూజర్ల నంబర్లు విక్రయానికి ఉంచినట్టు తెలుస్తోంది. ఓ హ్యాకింగ్ కమ్యూనిటీ ఫోరమ్‌లో వీటి విక్రయానికి సంబంధించిన ఒక ప్రకటన ఉందని సైబర్ న్యూస్ కథనం తెలిపింది. 
 
ఈ ప్రకటన మేరకు 48.7 కోట్ల వినియోగదారుల ఫోన్ నంబర్లతో 2022 డెటాబేస్‌ను విక్రయిస్తున్నట్టు ఓ హ్యాకర్ ఆన్‌లైన్ ప్రకటన ఇచ్చాడు. అమెరికా, బ్రిటన్, ఈజిప్టు, ఇటలీ, సౌదీ అరేబియాతో సహా మొత్తం 84 దేశాలకు చెందిన యూజర్ల నంబర్లను అమ్మకానికి పెట్టారని సైబర్ న్యూస్ కథనం పేర్కొంది. ఇందులో భారత్‌కు చెందిన వాట్సాప్ మొబైల్ యూజర్లు కూడా ఉన్నారు.