శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 31 జులై 2018 (12:18 IST)

వాట్సాప్‌లో మరో అద్భుతమైన ఫీచర్...

వాట్సాప్‌లో మరో అద్భుతమైన ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ ఫలితంగా ఇకపై యూజర్లు అందులో గ్రూప్ వీడియో కాలింగ్ చేసుకునే వెసులుబాటు లభించింది. వాట్సాప్ ప్రవేశపెట్టిన గ్రూప్ వీడియో కాలింగ్ ఫీచర్ సహాయం

వాట్సాప్‌లో మరో అద్భుతమైన ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ ఫలితంగా ఇకపై యూజర్లు అందులో గ్రూప్ వీడియో కాలింగ్ చేసుకునే వెసులుబాటు లభించింది. వాట్సాప్ ప్రవేశపెట్టిన గ్రూప్ వీడియో కాలింగ్ ఫీచర్ సహాయంతో ఒకేసారి నలుగురు గ్రూప్ వీడియో కాలింగ్ చేసుకోవచ్చు.
 
అయితే ముందుగా ఇద్దరు యూజర్లు వన్ టు వన్ వీడియో చాటింగ్ మొదలు పెట్టాలి. అనంతరం ఇద్దరు యూజర్లను అందులోకి యాడ్ చేయాలి. దీంతో గ్రూప్ వీడియో కాలింగ్ సాధ్యపడుతుంది.
 
వాట్సాప్ గ్రూప్ వీడియో కాలింగ్ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందుబాటులో ఉంది. ఈ యాప్‌కు చెందిన అప్‌డేటెడ్ వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే గ్రూప్ వీడియో కాలింగ్ ఫీచర్‌ను యూజర్లు పొందవచ్చు.