మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 మే 2020 (18:45 IST)

రెడ్‌మీ నుంచి కొత్త ఎక్స్ సిరీస్ స్మార్ట్‌టీవీలు-మే 26న విడుదల

Smart TV
చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి రెడ్‌మి నుంచి కొత్త ఎక్స్ సిరీస్ స్మార్ట్‌టీవీలను లాంఛ్ చేయనుంది. ప్రస్తుతం సంక్షోభ సమయంలో మూడు స్మార్ట్ టీవీలను చైనాలో జరగబోయే లాంచ్ ఈవెంట్‌లో తీసుకు రానుంది. రెడ్‌మి టీవీ ఎక్స్50, రెడ్‌మి ఎక్స్ 55, రెడ్‌మి ఎక్స్ 65 స్మార్ట్ టీవీలను కంపెనీ మే 26వ తేదీన లాంచ్ చేయనుంది. దీంతోపాటు రెడ్ మీ 10ఎక్స్ సిరీస్ స్మార్ట్ ఫోన్లను కూడా లాంచ్ చేయనుందని సమాచారం.
 
బెజెల్‌‌లెస్‌ డిజైన్‌‌తో చిన్ని సైజులో ఈ టీవీ అందుబాటులో రానుందని తెలుస్తోంది. ఈ టీవీల సైజ్ గురించి తప్ప వీటికి సంబంధించిన మరే సమాచారం అందుబాటులో లేదు. ఈ టీవీలు డిజైన్, పిక్చర్ క్వాలిటీ, సౌండ్ క్వాలిటీలో మెరుగ్గా వుంటాయని మాత్రమే రెడ్‌మి ప్రకటించింది. అలాగే ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో భారతదేశంలో వీటిని లాంచ్‌ చేసే అవకాశం వుందని తెలుస్తోంది.