షియోమీ న్యూ ఇయర్ కానుక.. టీవీపై ధర తగ్గింపు

Last Updated: మంగళవారం, 1 జనవరి 2019 (18:14 IST)
చైనా కంపెనీ షియోమీ న్యూ ఇయర్ కానుకగా తన వినియోగదారుల కోసం 32, 49 అంగుళాల ఎంఐ టీవీలపై ధరలని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు షియోమీ ఇండియా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వివరాలని పొందుపరించింది. 
 
32 అంగుళాల 'ఎంఐ ఎల్.ఈ.డీ టీవీ 4ఏ పై రూ.1500, ఎంఐ ఎల్.ఈ.డీ టీవీ 4సీ ప్రోపై రూ.2000 తగ్గించిన షియోమీ, 49 అంగుళాల ఐ ఎల్.ఈ.డీ టీవీ 4ఏ ప్రో పై రూ.1000 తగ్గించింది.
 
జియోమీ ఎమ్ఐ టీవీ ఫోర్ఏ ప్రో 49 రూ.31,999గా అమ్మబడగా, ప్రస్తుతం వెయ్యిరూపాయల మేర ధరను తగ్గించింది. తద్వారా ఈ మోడల్ రూ.30,999గా పలుకుతోంది. దీనిపై మరింత చదవండి :