అద్భుత ఫీచర్లతో షియోమీ రెడ్‌మీ 7..!

Last Updated: బుధవారం, 13 మార్చి 2019 (10:45 IST)
నేటి తరుణంలో స్మార్ట్‌ఫోన్స్ ఎక్కువైపోతున్నాయి. ఒక రోజుకు ఎన్నిరకాల స్మార్ట్‌ఫోన్స్ చేస్తున్నారంటే అది మాటల్లో చెప్పలేం. స్మార్ట్‌ఫోన్స్ వలన ఎన్నో ప్రయోజనాలున్నాయి. అవసరాలను తీర్చేవాటిల్లో స్మార్ట్‌ఫోన్ ముఖ్యంగా చెప్పొచ్చు. టీవీ, కంప్యూటర్స్ కంటే స్మార్ట్‌ఫోన్స్ ఎక్కువగా ఉన్నాయి. అలాంటి స్మార్ట్‌ఫోన్లలో షియోమీ ఒకటి.

షియోమీ తన నూతన స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ 7 ను మార్చి 18వ తేదీన విడుదల చేయనుంది. ప్రస్తుతం ఈ ఫోన్ ధన వివరాలను ఇంకా చెప్పలేదు. అయితే, ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందివ్వనున్నారు.

షియోమీ రెడ్‌మీ 7 ఫీచర్స్:
6.26 ఇంచ్ హెడ్‌డీ డిస్‌ప్లే, 1520 × 720 పికల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 632 ప్రాససర్, 2/3/4 జీబీ ర్యామ్, 16/32/64 జీబీ స్టోరేజ్, 256 ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయర్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.



దీనిపై మరింత చదవండి :