శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 31 మార్చి 2021 (16:42 IST)

ఎంఐ మిక్స్‌ ఫోల్డ్‌ స్మార్ట్ ఫోన్.. స్పెసిఫికేషన్స్.. మడతబెట్టే ఫోన్లకు గట్టిపోటీ

Mi Mix Fold brings
చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ మేకర్‌ షియోమీ తన మొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ఎంఐ మిక్స్‌ ఫోల్డ్‌ పేరుతో ఈ ఫోన్‌ను ప్రపంచమార్కెట్లోకి విడుదల చేసింది. ఎడ్జ్-టు-ఎడ్జ్ డిస్‌ప్లేను కలిగి ఉన్న ఫోన్‌ దిగువన సెల్ఫీ కెమెరా ఉంది. 2కె స్క్రీన్‌, డెస్క్‌టాప్‌ మోడ్‌, 67డబ్ల్యూ ఫాస్ట్‌ ఛార్జింగ్‌, వెనకవైపు క్వాడ్‌ కెమెరా సెటప్‌ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
 
మిక్స్‌ ఫోల్డ్‌లో రెండు స్క్రీన్లు ఉన్నాయి. అందులో ఒకటి సింగిల్‌ ఔటర్‌ స్క్రీన్‌ కాగా మరొకటి ఫోల్డింగ్‌ ఇన్నర్‌ డిస్‌ప్లే. గెలాక్సీ ఫోల్డ్‌ 2 మాదిరిగా ఔటర్‌ డిస్‌ప్లేలో లార్జ్‌ ఫుల్‌ స్క్రిన్‌ ఉంటుంది. ఔటర్‌ స్క్రీన్‌ 6.52 అంగుళాల అమోలెడ్‌ ప్యానెల్‌ను కలిగి ఉండగా ఇన్నర్‌ ఫోల్డింగ్‌ స్క్రీన్‌ సైజు 8.01 అంగుళాలతో ఉంది. శాంసంగ్‌ గెలాక్సీ జెడ్ ఫోల్డ్‌ 2, హువావే మేట్‌ ఎక్స్2 మడతబెట్టే ఫోన్లకు మార్కెట్లో మిక్స్‌ ఫోల్డ్‌ గట్టిపోటీ నివ్వనుంది.
 
మిక్స్‌ ఫోల్డ్‌ స్మార్ట్‌ఫోన్‌లో బేసిక్‌ వేరియంట్‌ ధర సుమారు 1,12,100గా ఉండగా టాప్‌ మోడల్‌ ధర సుమారు రూ.1,45,700 నిర్ణయించారు. చైనాలో ఏప్రిల్‌ 16 నుంచి ఫోన్లను కొనుగోలు చేయొచ్చు. ఐతే ప్రపంచవ్యాప్తంగా మిగతా దేశాల్లో మడతబెట్టే ఫోన్లను ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారో కంపెనీ ప్రకటించలేదు.
 
ఎంఐ మిక్స్‌ ఫోల్డ్‌ స్పెసిఫికేషన్లు:
రియర్‌ కెమెరా: 108+8+13 ఎంపీ
ర్యామ్‌: 12జీబీ
స్టోరేజ్‌: 256జీబీ
బ్యాటరీ: 5020mAh
ఓఎస్‌: ఆండ్రాయిడ్‌ 10
డిస్‌ప్లే: 8.01 అంగుళాలు
ప్రాసెసర్‌: క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 888
ఫ్రంట్‌ కెమెరా: 20 ఎంపీ