1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 15 ఏప్రియల్ 2015 (13:25 IST)

యూట్యూబ్ నావిగేషన్‌లో మరో 15 భాషలు: 76కి చేరిన భాషల సంఖ్య!

యూ‌ట్యూబ్‌ నావిగేషన్‌లో మరో 15 భాషలు కొత్తగా చేరాయి. దీంతో తమ తమ మాతృభాషలో వెబ్‌సైట్‌ను వీక్షించే అవకాశమున్న భాషల సంఖ్య 76కు చేరినట్లయింది. అంటే మొత్తం 76 భాషలకు చెందిన ప్రజలు మాతృభాషలో వెబ్‌సైట్‌ను చూడొచ్చు. దీంతో 95 శాతం మంది ప్రజలకు అందుబాటులోకి వచ్చామని యూట్యూబ్‌ వెల్లడించింది.
 
సాధ్యమైనంత ఎక్కువ భాషల్లో వెబ్సైట్ను అందుబాటులోకి తెచ్చేందుకు సంస్థ  డెవలపర్స్ అహర్నిశలూ కృషిచేస్తున్నారని యూట్యూబ్ సంస్థ తెలిపింది. ఇప్పటికే  165 భాషలకు వీడియో కాప్షన్ సపోర్ట్ సదుపాయం ఉందన్నారు.

యూ ట్యూబ్ లో కొత్తగా.. అజర్బైజాన్, అర్మీనియన్, జార్జియన్, ఖజక్, ఖ్మేర్, కిర్గిజ్, లావో, మాసిడోనియన్, మంగోలియన్, మయన్మార్ (బర్మా, నేపాలీ, పంజాబీ, సింహళ, అల్బేనియన్, ఉజ్బెక్) అనే భాషలు చేరాయి.