శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. కథనాలు
Written By CVR
Last Updated : బుధవారం, 24 జూన్ 2015 (17:48 IST)

పంపిన మెయిల్‌ను తిరిగి పొందే సౌకర్యం... జీ-మెయిల్ పరిచయం..

ఇతరులకు పంపించిన మెయిల్‌ను తిరిగి పొందే సౌకర్యాన్ని జీ-మెయిల్ సంస్థ పరిచయం చేసింది. ఇప్పటి వరకు మన మెయిల్ ఐడీ నుంచి ఇతరులకు మెయిల్ పంపించినట్లైతే దానిని తిరిగి పొందలేము. ఈ స్థితిలో ఇంటర్నెట్ పోస్టింగ్ సేవల్లో ముందంజలో ఉన్న జీ-మెయిల్ సంస్థ అత్యాధునిక సౌకర్యాన్ని పరిచయం చేసింది. తద్వారా పంపిన మెయిల్‌ను తిరిగి పొందే unsend ఆపర్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది.
 
ఈ సౌకర్యం ద్వారా పొరపాటుగా ఎవరికైనా మెయిల్ చేసినట్లైతే, దానిని తిరిగి పొందవచ్చును. పంపిన మెయిల్‌ను unsend చేయదలచుకుంటే మొదట  జీ-మెయిల్‌లోకి వెళ్లాలి. తర్వాతా అందులోని settings ఆపర్షన్‌ను క్లిక్ చేయాలి. అందులో ఉన్న Laps ఆపర్షన్‌ను క్లిక్ చేసి, లోపలికి వెళ్లిన వెంటనే Undo Send అనే విభాగానికి వెళ్లి, అక్కడ Undo సౌకర్యాన్ని Enable చేయాలి. తర్వాత Save Changes బటన్‌ను క్లిక్ చేయండి.
 
ఆ తర్వాత మీరు ఎవరికైనా మెయిల్ చేసినట్లైతే ఒక బాక్స్ వస్తుంది. అందులో Unsend అనే సౌకర్యం 30 సెకన్ల పాటు మానిటర్‌పై కనిపిస్తుంది. ఆ సమయంలో మీరు పంపిన మెయిల్‌ను తిరిగి పొందాలనుకుంటే వెంటనే Unsend ఆప్షన్‌ను క్లిక్‌చేసి తిరిగి పొందవచ్చును.