శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. కథనాలు
Written By PNR
Last Updated : మంగళవారం, 15 జులై 2014 (18:32 IST)

మెరుపు వేగంతో బ్రౌజింగ్ చేయాలంటే...!

చాలా మంది నెటిజన్లు బ్రౌజింగ్ చేయడానికి చాలా మందకొడిగా ఉంటారు. నిజానికి చిన్నపాటి చిట్కాలు తెలుసుకున్నట్టయితే, నెట్ బ్రౌజింగ్ చాలా ఫాస్ట్‌గా చేయవచ్చు. ఇందుకోసం కొన్ని షార్ట్‌కట్స్‌ను నేర్చుకున్నట్టయితే చాలు... అవేంటో ఇక్కడ పరిశీలిద్ధాం. 
 
సాధారణంగా బ్రౌజర్ ఓపెన్ చేసిన ప్రతిసారీ వెబ్‌సైట్ పేరు మొత్తం టైప్ చేయాల్సి వస్తుంది. నిజానికి ప్రతి సారి అడ్రస్ బార్‌లో వెబ్‌సైట్ పేరు టైప్ చేయాల్సిన పని లేదు. కొంత శ్రమకోర్చి షార్ట్‌కట్‌లను ఏర్పాటు చేసుకుంటే మీరు తరచూ చూసే వెబ్‌సైట్లను చటుక్కున ఓపెన్ చేయవచ్చు.
 
గూగుల్ క్రోమ్ బౌజర్‌ను వినియోగిస్తున్నట్టయితే వెబ్ సైట్ అడ్రస్ టైప్ చేసే ప్రదేశమైన ఓమ్నీ బాక్స్‌పై రైట్ క్లిక్ చేసి "ఎడిట్ సెర్చ్ ఇంజిన్స్" ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోండి. ఒక డైలాగ్ బాక్స్ ప్రత్యక్షమవుతుంది. అందులో అదర్ సెర్చ్ ఇంజిన్స్ అని ఉన్న చోట మీరు తరచుగా బ్రౌజ్ చేసే వెబ్‌సైట్‌ను మీకు ఇష్టమైన ‘కీవర్డ్’తో ఓపెన్ చేయాలనుకుంటున్నారో, ఆ కీవర్డ్‌, మరోబాక్సులో యూఆర్‌ఎల్‌లను టైప్ చేయండి. అంతే... ఆ తర్వాత మీరు కేవలం ఆ ఒక్క కీవర్డ్ కొడితే ఆ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. 
 
ఇకపోతే.. మరికొంతమందికి టైపింగ్, ఇంకొంతమందికి మౌస్ క్లిక్‌లంటే పరమచిరాకు. అలాంటి వారికోసం కీబోర్డు షార్ట్‌కట్‌లు ఎంతో ఉపయోగపడతాయి. వీలైనన్ని ఎక్కువ కీబోర్డు షార్ట్‌కట్‌లను నేర్చుకుంటే సర్ఫింగ్ మరింత సులువు అవుతుంది. టైపింగ్ కంటే మౌస్ క్లిక్‌ల ద్వారా వేళ్లు, చేతి కీళ్లపై ఎక్కువ ఒత్తిడి పడుతుందన్నది గమనార్హం.
 
కొత్త ట్యాబ్ ఓపెన్ చేయాలంటే ‘కంట్రోల్ + టీ’, ఉపయోగిస్తున్న ట్యాబ్‌ను క్లోజ్ చేసేందుకు ‘కంట్రోల్ + డబ్ల్యూ’, ఒక ట్యాబ్ నుంచి మరోదానికి వెళ్లేందుకు ‘కంట్రోల్ + ట్యాబ్’, ఉపయోగిస్తున్న పేజీని రిఫ్రెష్ చేసేందుకు ‘ఎఫ్5’ ఫంక్షన్ కీ, ఫుల్‌స్క్రీన్‌లోకి మారేందుకు, వెనక్కు వచ్చేందుకు ‘ఎఫ్11’, అడ్రస్‌బార్‌లోని విషయాలను హైలైట్ చేసేందుకు, కర్సర్‌ను అక్కడ ఉంచేందుకు ‘ఎఫ్6’ కీలు పని వినియోగించవచ్చు.