గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By chitra
Last Updated : గురువారం, 28 జనవరి 2016 (15:07 IST)

చల్లటి సాయంత్రం..పిల్లల్నిబీచ్‌కి తీసుకెళ్లేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటి?

చల్లటి సాయంత్రం వేళ పిల్లల్ని బీచ్‌కు తీసుకెళ్లేటప్పుడు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మంచిది. దాంతోపాటు పిల్లలు బీచ్‌‌లో ఎంజాయ్ చేస్తారు, అంతేకాదు తల్లిదండ్రులకు టెన్షన్ తప్పుతుంది. అలాంటి జాగ్రత్తలేంటో చూద్దాం!
 
బీచ్‌ దగ్గర పిల్లలు ఆడుకునేటప్పుడు ఎలాంటి విపత్తులకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సముద్రంలో అలల తీరును కూడా గమనించుకుంటుండాలి. మీరెంచుకున్న స్థలంలో నీటి ఒరవడి తీవ్రంగా ఉంటే ఆ స్థలాన్ని వదిలి మరో చోటును ఎంచుకోవడం మంచిది.
 
పిల్లల్ని బీచ్‌లకు తీసుకెళ్లడం వల్ల ఫిషింగ్‌‌తో పాటు అక్కడికొచ్చే రకరకాల పక్షులను పిల్లలు చూడొచ్చు. డాల్ఫిన్‌ లాంటి వాటి గురించి తెలుసుకోవచ్చు. అలలను చూస్తూ ఎంజాయ్‌ చేయొచ్చు.
 
బీచ్‌లో పడుకుని సూర్యరశ్మిని ఎంజాయ్‌ చేయొచ్చు. మనకు కావాల్సిన డి-విటమిన్‌ని ఇది ఇస్తుంది. సర్ఫింగ్‌ చేయొచ్చు. బీచ్‌లోని మట్టిలో నడిచే అనుభూతిని పిల్లలు బాగా ఎంజాయ్‌ చేస్తారు. పిల్లలు బీచ్‌ ఒడ్డున వ్యాయామాలు చేసుకోవచ్చు. రకరకాల ఆటలు ఆడుకోవచ్చు.