ఆదివారం, 17 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 26 సెప్టెంబరు 2024 (19:52 IST)

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

Kids
పిల్లల మెదడు ఆరోగ్యానికి బెర్రీలు మంచివి. ఇవి మెదడులో జ్ఞాపకశక్తి కోల్పోకుండా చేసి, నరాల పనితీరు, కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరచడంలో సహాయపడతాయి. అలాగే బీన్స్‌లో ఫైబర్, బి విటమిన్లు, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడుతుంది. 
 
అదేవిధంగా ఆకుకూరల్లో విటమిన్ ఇ, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు అభివృద్ధికి సహాయపడతాయి. ముఖ్యంగా కాలీఫ్లవర్, బ్రోకలీ మెదడు ఆరోగ్యానికి సహాయపడతాయి. ఈ కూరగాయలలో కోలిన్ అధికంగా ఉంటుంది. ఇది జ్ఞాపకశక్తిని బలపరుస్తుంది. ఆలోచనా సామర్థ్యాన్ని కూడా పదును పెడుతుంది.
 
వాల్‌నట్స్‌లో మెదడుకు మేలు చేసే ఒమేగా-3 వంటి పోషకాలు ఉంటాయి. వాల్ నట్స్‌ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. అలాగే వేరుశెనగ పప్పు కూడా మెదడుకు మంచిదని నిపుణులు చెబుతున్నారు