శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 3 జులై 2014 (14:41 IST)

పిల్లలున్నారా? పారెంట్స్ అలా నిద్రపోతే సమస్యలు తప్పవట!

మీ ఇంట్లో పిల్లలున్నారా? వారు చేసే అల్లరితో పారెంట్స్‌కు నిద్రలేదా? అయితే ఈ స్టోరీ చదవండి. పిల్లల పెంపకంతో తల్లిదండ్రులు నిద్రను కోల్పోవాల్సి ఉంటుంది. పిల్లలపై దృష్టి పెట్టే తల్లిదండ్రులు వారి ఆరోగ్యంపై కూడా శ్రద్ధ తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. 
 
ఇంట్లో పసిపాపలు అటూ ఇటూ పాకుతూ అల్లరి చేస్తుంటే భలే ముచ్చటగా ఉంటుంది. ఇది చూడటానికి బాగానే వుంటుంది. కానీ.. వీళ్లు చేసే అల్లరి పనుల వల్ల తల్లిదండ్రులు తమ జీవిత కాలంలో చాలా మటుకు నిద్రను కోల్పోవాల్సి వస్తుంది. 
 
పసిపాపలు పగటి పూట చేసే అల్లరి, రాత్రుళ్లు పక్కతడపటాలు, ఓ సమయమంటూ లేకుండా వారికి ఇష్టమెచ్చినప్పుడు నిద్రపోవటం మూలంగా తల్లిదండ్రులు వారి ఆలనాపాలనా చూడటంలో దాదాపు నిద్రను పాడుచేసుకోవాల్సి వస్తుంది.
 
సాధారణంగా ఒక రోజులో మనిషికి కనీసం ఏడు గంటల ప్రశాంతమైన నిద్ర కావాలి. అయితే చిన్నపిల్లలు చేసే ఈ పనుల వల్ల వారి సంరక్షణలో పడి పారెంట్స్ నిద్రకు దూరమవుతున్నారు. అయితే.. ఈ సందర్భంలో చాలా మంది తల్లిదండ్రులు పగటిపూట పిల్లలు నిద్ర పోతున్నప్పుడు కానీ.. లేదా పిల్లలు అల్లరి లేకుండా కాస్తంత విరామ సమయం దొరికినప్పుడు కానీ.. ఒక సమయం అంటూ లేకుండా నిద్ర పోతుంటారు. అయితే ఇలా నిద్రపోవటం శరీరానికి అంత ఆరోగ్యకరం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 
ఈ విధంగా నిద్రపోవటం మూలానా శారీరక, మానసిక ఒత్తిళ్లతో పాటు కొత్త సమస్యలను కొనితెచ్చుకున్న వారవుతారని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి పిల్లల పోషణతోపాటూ తల్లిదండ్రులు కూడా పౌష్టిక ఆహారాన్ని తీసుకోవటంతో పాటు, వ్యాయామం చేయటం, మనసుకి ప్రశాంతత ఇవ్వటం వంటివి చేయగలిగినప్పుడే ఇటువంటి సమస్యలని ధైర్యంగా ఎదుర్కోవచ్చని శాస్తవ్రేత్తలు సూచిస్తున్నారు.