1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 14 డిశెంబరు 2015 (18:13 IST)

పెరిగే పిల్లలకు కోడిగుడ్డు ఆఫ్ బాయిల్‌గా ఇస్తే?

శిశువు పెరుగుదలకు సహజమైన ఆహారాన్ని ఇవ్వాలి. తల్లిపాలపైననే పూర్తిగా ఆధారపడే శిశువు క్రమంగా పెద్దలు తీసుకొనే ఆహారానికి మారే దశను 'వీనింగ్' అంటారు. శిశువు ఎదుగుదలను దృష్టిలో పెట్టుకుని ఆహారంలో మార్పులు, చేర్పులు చేయాలి. శిశువుకు ఇచ్చే ఆహారంలో ఎక్కువ పోషక విలువలు ఉండేలా చూసుకోవాలి. ఇంకా పిల్లల మానసికాభివృద్దికి కావలసిన ప్రేరణ, పిల్లలను పెంచడంలో మెలకువలు కూడా పాటించాలి.
 
ఉదయం పూట ఇడ్లీ, ఇంట్లో చేసిన పండ్ల జ్యూస్‌లను తినిపించడం, ఆహారంలో కూరగాయలు, పప్పు, తృణధాన్యాల పొడుల్ని చేర్చుకోవడం ద్వారా మీపిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. కోడిగుడ్డును ఉడికించి కాకుండా ఆఫ్ బాయిల్‌గా ఇవ్వడం ద్వారా పెరిగే కొద్దీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌ను దూరం చేయొచ్చు. అలాగే మటన్, చికెన్‌లను సూప్‌ల ద్వారా వారానికి రెండు సార్లు ఇవ్వడం మంచిదని న్యూట్రీషన్లు అంటున్నారు.