శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 9 మార్చి 2015 (17:01 IST)

ఇంట్లో పిల్లలున్నారా..? ఎంత మేలో తెలుసుకోండి!

ఇంట్లో పిల్లలున్నారు.. అబ్బే ఒకటే గోల అనుకుంటున్నారా..? అయితే వెంటనే మీ దృక్పథాన్ని మార్చుకోండి. ఇంట్లో పిల్లలు వుండటం వల్ల ఆందోళన, ఒత్తిడి మటుమాయం అవుతుంది. ఒక రోజంతా కష్టపడ్డాక ఇంటికి తిరిగి రాగానే పిల్లవాడి చిరునవ్వు చూస్తే ఎంత సంతోషం కలుగుతుందో ఎవరైనా తల్లిని అడిగి చూడండి. ఎంత అలిసిపోయి, నిస్పృహగా, చికాకుగా వున్నా పిల్లవాడి ప్రేమపూర్వక ఆలింగనం చాలా మార్పు కలిగిస్తుంది.
 
పిల్లలు వుండడం ఒక వివాహ బంధానికి చాలాసార్లు ఎంతో మేలు చేస్తుంది. పిల్లలు పుట్టగానే దంపతుల మధ్య బంధాలు బలపడడం చాలా సార్లు చూస్తూనే వుంటాం. పిల్లలు వుండడం వల్ల ఒకరిపట్ల ఒకరికి ఎంతో కృతజ్ఞత కలుగుతుంది. పోయిన ప్రేమలను తిరిగి పొందగలుగుతారు.
 
అలాగే వృద్ధులుంటే వారికి పిల్లలు మానసిక, శారీరిక, భావనాత్మక బలాన్ని అందిస్తారు. దాంతో వృద్ధాప్యం ఆనందంగా గడిచిపోతుంది. జీవితంలో చాలా దశలలో పయనిస్తా౦. ఒక్కోసారి కాలం వెళ్ళదీయడానికి ఊహించినంత బలం కావాల్సి రావచ్చు. జీవితం ఒక్కోసారి మనల్ని కుంగదీస్తుంది. అయితే, మీకు పిల్లలు వుంటే వారి భావిని తీర్చి దిద్దడానికి ఈ కష్టాల్లోంచి బయట పడాలనే ప్రేరణ మీకు నిరంతరం కలుగుతూ వు౦టు౦దని మానసిక నిపుణులు అంటున్నారు.