మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 8 ఏప్రియల్ 2015 (18:21 IST)

పిల్లలకు కొత్త కొత్త అంశాల్ని నేర్పిస్తుంటే.. మెదడు పదునెక్కుతుందట!

పిల్లల్ని ఎప్పుడూ స్కూళ్ళు, చదువులు, హోం వర్కులు, ఆపైన టీవీ కార్యక్రమాలకు పరిమితం చేస్తే వారిలోని సృజనాత్మక శక్తి అజ్ఞాతంగానే వుండిపోతుంది. సాధారణంగా చదువుల నుంచి ఖాళీ దొరికితే టెలివిజన్ ముందు సెటిలయిపోతుంటారు. అలాకాకుండా వారికి కొత్త కొత్త అంశాల్ని నేర్పిస్తుంటే మెదడు పదునెక్కుతుంది. అందుచేత ఖాళీ సమయాల్లో ముఖాకృతులను గీయడం నేర్పించండి. 
 
అందుచేత తెల్లని ఔట్ లైన్స్ జతచేసి, నిండు రంగులు మేళవించినప్పుడు ముఖాకృతి క్లాసిక్‌గా కనిపిస్తాయి. గోడకు తెల్లని కాగితాన్ని అంటించాలి. దానిముందు ఓ వైపుగా చిన్నారిని నిటారుగా కూర్చోబెట్టి, లైటింగ్ ఫోకస్ చేస్తే ఆ చిన్నారి నీడ కాగితంపై పడుతుంది. ఈ నీడచుట్టూ ఔట్ లైన్ గీసుకుని, దాన్ని కట్ చేయాలి. ఈ రూపాన్ని రంగుల కాగితంపై అంటించి, చుట్టూ తెల్లని ఫ్రేమ్‌ అమర్చితే వెరైటీ చిత్రం తయారవుతుంది. ఇలాగే వివిధ రూపాలు గీసుకోవచ్చు.