శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 22 అక్టోబరు 2014 (16:12 IST)

పిల్లల అరచేతుల్లో స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్‌లా.. వామ్మో జాగ్రత్త!

పిల్లల అరచేతుల్లో ఎప్పుడూ స్మార్ట్‌ ఫోన్లు, ట్యాబ్‌లు కనిపిస్తుంటే.. జాగ్రత్త పడాలని మానసిక నిపుణులు తల్లిదండ్రులను హెచ్చరిస్తున్నారు. టీనేజర్ల విషయంలో పారెంట్స్ ఇంకా జాగ్రత్త పడాలని వారు సూచిస్తున్నారు.
 
తమ పిల్లలు మొబైల్ ఫోన్లు, ట్యాబ్‌లలో ఏం చూస్తున్నారో తల్లిదండ్రులు గమనించాలని సైకాలజిస్టులు సూచిస్తున్నారు. ఇటీవల కాలంలో పిల్లలు సెల్ ఫోన్లు, ఇంటర్నెట్ ద్వారా అశ్లీల చిత్రాలను వీక్షిస్తున్న ఘటనలు నానాటికీ ఎక్కువవుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో ఎలా వ్యవహరించాలో తెలియక తల్లిదండ్రులు, టీచర్లు అయోమయానికి గురవుతున్నారు.
 
అయితే, అందుకు చేయాల్సిందల్లా తల్లిదండ్రులు తమ పిల్లలతో తరచూ మాట్లాడుతూ, వారితో స్నేహపూర్వకంగా మెలగడం ద్వారా పరిస్థితిలో మార్పు తీసుకురావచ్చునని, అశ్లీలం, హింసతో కూడుకున్న చిత్రాలకు బానిసలైతే ఎదురయ్యే దుష్పరిణామాలను పిల్లలకు ఓపికతో వివరించాలని సీనియర్ సైకియాట్రిస్ట్ సీజే జాన్ సూచించారు.