1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 12 సెప్టెంబరు 2014 (17:19 IST)

పాలా.. వద్దు మమ్మీ అంటున్నారా? ఇవిగోండి చిట్కాలు

మీ పిల్లలకు పాలు, పాల ఉత్పత్తులంటే అలర్జీనా.. అయితే పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదంటున్నారు న్యూట్రీషన్లు. పాల నుంచి శరీరానికి లభించే పోషకాలు... ఇతరత్రా ఆహారం నుంచి లభిస్తాయి.  
 
పాలులో అధికంగా క్యాల్షియం శాతం అధికంగా ఉంటుంది. అదే క్యాల్షియం రాగి, చిరు ధాన్యాల్లోనూ పుష్కలంగా ఉంది. అందుచేత పాలు తాగమని చెప్పడం కంటే రాగి జావ ఇవ్వడం అలవాటు చేయండి. శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి.  
 
అలాగే రాజ్‌మా, శెనగలు, నువ్వుల ఉండలు, ఆకుకూరలను కూడా పిల్లలకు ఆహారంగా పెడుతూ ఉంటే క్యాల్షియంతో పాటు ఇతరత్రా పోషకాలు లభిస్తాయి. ఇంకా నువ్వుల పొడితో కలిపిన అన్నం ముద్దలు, ఇడ్లీలు తినిపించాలి.  
 
ఇకపోతే.. కొబ్బరిలోనూ క్యాల్షియం శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే నాన్‌ వెజ్ తినే వారైతే పాలులోని విటమిన్ బి12ను పొందవచ్చు. వారానికి రెండు లేదా ఒక్కసారైనా మాంసాహారం ఇవ్వడం మరిచిపోకండి.  
 
పాల రూపంలోనే కాకుండా పనీర్ లేదా చీజ్ రూపంలోనూ పిల్లలకు నచ్చిన వంటకాలను సర్వ్ చేయొచ్చు. తేనె, వేరుశెనగలు రోజు వారి పిల్లల డైట్‌లో చేర్చుకుంటే శరీరానికి ఎంతో మేలు చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.