గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By chj
Last Modified: గురువారం, 22 డిశెంబరు 2016 (21:36 IST)

బిడియం అభివృద్ధికే అడ్డంకి... పిల్లల్లో అది లేకుండా చేయాలంటే....

బిడియం ఉన్న వ్యక్తులలో వారిపట్ల వారికి సరైన విశ్వాసం, దృక్పథం ఉండదు. వీరు ఇతరులను సరిగా అవగాహన చేసుకోలేరు. వీరికి బిడియంతో పాటు సిగ్గు కూడ చోటుచేసుకుంటే ఇతరుల వద్ద వారి ఇబ్బంది చెప్పనే అవసరం లేదు. ఇలాంటి మనస్తత్వం ఉన్నవారు ప్రతి సందర్భంలో ఎదురుదెబ్బ

బిడియం ఉన్న వ్యక్తులలో వారిపట్ల వారికి సరైన విశ్వాసం, దృక్పథం ఉండదు. వీరు ఇతరులను సరిగా అవగాహన చేసుకోలేరు. వీరికి బిడియంతో పాటు సిగ్గు కూడ చోటుచేసుకుంటే ఇతరుల వద్ద వారి ఇబ్బంది చెప్పనే అవసరం లేదు. ఇలాంటి మనస్తత్వం ఉన్నవారు ప్రతి సందర్భంలో ఎదురుదెబ్బ తినడంతో మానసిక వేదనకు గురికావలసివస్తుంది. వీరు ఇతరులను కలవలేక పోవడం, బిడియం ఇలాంటి పరిస్థితులు చిన్న తనంలోనే బీజాలు ఏర్పడతాయి.
 
దీనికి ముఖ్యంగా పిల్లల ఎడల తల్లిదండ్రుల మరియు బడిలో ఉపాధ్యాయుల ప్రవర్తన కారణం తండ్రి, తల్లి మీద కోపం వచ్చో, ఇతరుల మీద కోపం వచ్చో పిల్లలు ఏదైన అడిగినపుడు ఆ కోపాన్ని పిల్లల మీద చూపిస్తే ఆ పిల్లల్లో తండ్రితో ఎప్పుడు మాట్లడాలో ఎలా అడగాలో తెలియని పరిస్థితి. పిల్లలు ఏమి మాట్లాడినా తల్లిదండ్రులు చిరాకుపడుతుంటే వారికి మాట్లాడటం అంటేనే భయం వేస్తుంది. ఏమంటే ఏమంటారో అనే అనుమానం కలుగుతుంది. అలానే వారికి తేలియకుండానే బిడియం ఏర్పడుతుంది.
 
పాఠశాలలో కూడా టీచరు అడిగిన దానికి విద్యార్థి ఒక్కొక్కసారి పొరబాటుగా జవాబు చెప్పవచ్చు. అటువంటప్పుడు ఆ విద్యార్థిని పనికిరానివాడి క్రింద జమకట్టి ఎగతాళి చేస్తే, తక్కిన విద్యార్థులు ఆ పిల్లవాడిని మరింత హేళన చేస్తారు. దానితో అతని మనస్సు గాయపడుతుంది. అటుపైన ఇక బాగా తెలిసిన విషయాన్ని కూడా టీచరు అడిగిన జవాబు చెప్పలేకపోతాడు. తనకు ఆ విషయం తెలిసినా సరిగ్గా తెలియదేమో అన్న అనుమానం ఏర్పడుతుంది. 
 
ఒకవేళ బాగా తెలిసినా, తప్పు అయితే తనని ఏమని హేళన చేస్తారో అన్న భయం ఏర్పడుతుంది ఈ విధంగా చిన్నప్పుడు ఏర్పడిన బిడియం మదిలో చోటుచేసుకుని యెప్పుడూ ఎదుటివారు తనని కించపరచకుండా జాగ్రత్త పడతారు. ఇటువంటి బిడియం మనస్తత్వం వుంటే కొత్తవాళ్ళ తో మాట్లాడేటపుడు వణికిపోతువుంటారు. ఇలాంటి వారు ఇంటర్వ్యూలప్పుడు వెళ్ళినపుడు భయపడి వచ్చిన అవకాశన్ని చేజార్చుకుంటారు. బిడియం మనస్తత్వం వున్న వ్వక్తులు దాని నుండి బయటపడటానికి కృషి చేయాలి. చిన్ననాటి బాధాకర స్మృతులని తుడిచి వేసుకోవాలి. ఇతరులు ఇచ్చే ప్రోత్సాహాన్ని చేయూతని స్వీకరించి బిడియాన్ని వదిలేసి ముందుకు సాగిపోవాలి. తనలో వున్న బిడియం తన అభివృద్ధికే అడ్డం అని గుర్తించాలి. అప్పుడే వ్యక్తిత్వం పెంపొంది వికాసం జరుగుతుంది.