1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 26 మార్చి 2015 (19:01 IST)

పిల్లలకు కరెన్సీ నోట్ల లెక్కింపు తప్పక నేర్పించండి.!

పిల్లలకు ఆరేళ్ళ తర్వాత లేదా ఎప్పుడైనా సరే నోట్ల లెక్కింపును నేర్పించండి. డబ్బు విలువ తెలియజేయండి. మీ దగ్గరున్న నాణేలను చూపించండి. నాణేల విలువ, రూ పాయి నోట్ల విలువను తెలియజేయండి. వాటిని ఎలా లెక్కించాలని చెప్పించండి. నోట్లు చేతికిచ్చి లెక్కపెట్టమనడం ద్వారా నెమ్మదిగా వారికి డబ్బుకున్న విలువ, డబ్బు విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలియజేస్తాయి. 
 
బ్యాంక్‌కి వెళ్లేటప్పుడు పిల్లలను తీసుకుని వెళ్ళండి. బ్యాంక్‌ల గురించి పిల్లలు అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పగలిగితే పిల్లలను మంచి దారిలో పెట్టినవారవుతారు. బ్యాంక్‌లో డబ్బు దాచుకున్నది ఇస్తారు కానీ ఉచితంగా ఇవ్వరని పిల్లలు వివరించాలి. అలా డబ్బు దాచుకునేందు అమ్మా, నాన్నలు ఎంత కష్టపడుతున్నది వివరించడం ద్వారా ఖర్చు చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించే స్థితి, టీనేజ్‌కి వచ్చేసరికి పిల్లల్లో కలుగుతుంది.