Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తొలిరోజు కృష్ణా పుష్క‌రాల్లో 5 ల‌క్ష‌ల మంది పుణ్య స్నానాలు... 33 మంది క్రిమినల్స్, 5 గ్యాంగులు

శుక్రవారం, 12 ఆగస్టు 2016 (21:26 IST)

Widgets Magazine
krishna pushkaralu

విజ‌య‌వాడ ‌:  కృష్ణా పుష్క‌రాల సంద‌ర్భంగా తొలిరోజు మద్యాహ్నం వరకూ 4 లక్షల మంది పుష్కర స్నానాలు ఆచరించారు. ఇది వాస్త‌వానికి చాలా త‌క్కువ సంఖ్య‌. వ‌రల‌క్ష్మీ వ్ర‌తం సంద‌ర్భంగా పుష్క‌ర యాత్రికుల సంఖ్య త‌గ్గి ఉండ‌వ‌చ్చ‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. రేపటి నుంచి మూడు రోజులపాటు శెలవులు కావడంతో భ‌క్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్న నేపధ్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామ‌ని హోం మంత్రి చిన‌రాజ‌ప్ప చెప్పారు. 
 
కంట్రోల్ రూం సహకారంతో ఘాట్లలో రద్దీని గమనించి ప్రజలను ఖాళీగా ఉన్న ఘాట్లలోకి మ‌ళ్లిస్తున్నామ‌ని చెప్పారు. ఈ పుష్కరాల్లో 31 వేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నార‌ని ఏపీ డీజీపీ సాంబ‌శివ‌రావు తెలిపారు. విధి నిర్వహణలో ఉండి ప్రాణాలు విడిచిన కానిస్టేబుల్ కుటుంబాన్ని ఆదుకుంటామ‌ని, వారి కుటుంబానికి 10 లక్షలు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంద‌ని చెప్పారు. 
 
33 మంది క్రిమినల్స్, 5 గ్యాంగ్స్‌ను గుర్తించామ‌ని, రద్దీగా ఉండే ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తున్న వారినీ అదుపులోకి తీసుకున్నామ‌ని చెప్పారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా 13 వందల సీసీ కెమేరాలతో నిఘా ఏర్పాటు చేశామ‌ని చెప్పారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
5 Lakh People Holy Bath Krishna River In 1st Day

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

శ్రావ‌ణ మాసం... వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం... కృష్ణా పుష్క‌రం... సంద‌డే సంద‌డి...

విజ‌య‌వాడ ‌: శ్రావణమాసం.. పవిత్ర వరలక్ష్మి వ్రతం... ఇంత‌టి ప‌విత్ర రోజున కృష్ణమ్మ ...

news

తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరాలు... చెన్నై తెలుగువారిని పిలవని ప్రభుత్వాలు...

తెలుగువారు ఎక్కడ ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో ఏదేని పండుగ జరుగుతున్నా, ఉత్సవాలు ...

news

శాస్త్రోక్తంగా జరిగే పెళ్లిళ్ళకు ముక్కోటి దేవతలు - దేవుళ్లు దిగివస్తారట

పెళ్లంటే నూరేళ్ల పంట. పెళ్లిళ్లు స్వర్గంలోనే నిశ్చయింపబడుతాయని పెద్దలు అంటుంటారు. ప్రతి ...

news

పుష్కర ఘాట్లలో నీళ్ళెక్కడ? మోకాళ్ల లోతు నీటిలో మునకెలా? జల్లు స్నానాలతో సరి?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన కృష్ణా పుష్కరాల తొలిరోజునే భక్తులు తీవ్ర ...

Widgets Magazine