ఆదివారం, 26 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కృష్ణా పుష్కరాలు 2016
Written By chj
Last Modified: శుక్రవారం, 12 ఆగస్టు 2016 (13:28 IST)

పుష్కర స్నానం 12 రోజులు... ఏయే రోజులు ఏయే దేవుళ్లను పూజించాలి? చేయాల్సిన జపాలేమిటి?

పుష్కరాలు ప్రారంభమైన తొలి రోజు శుక్రవారం శ్రీ మహావిష్ణువును పూజించాలి. గురుజపం మంత్రం ఉత్తమం. రెండవరోజు సూర్యుని పూజించాలి. పుష్కర మంత్రాన్ని జపించాలి. మూడవ రోజు కృష్ణానదీ జప మంత్రోచ్చారణ లక్ష్మీపూజ చేస్తారు. నాలుగవ రోజు గణపతి పూజ చేయాలి. నారాయణ జపమం

పుష్కరాలు ప్రారంభమైన తొలి రోజు శుక్రవారం శ్రీ మహావిష్ణువును పూజించాలి. గురుజపం మంత్రం ఉత్తమం. రెండవరోజు సూర్యుని పూజించాలి. పుష్కర మంత్రాన్ని జపించాలి. మూడవ రోజు కృష్ణానదీ జప మంత్రోచ్చారణ లక్ష్మీపూజ చేస్తారు. నాలుగవ రోజు గణపతి పూజ చేయాలి. నారాయణ జపమంత్రం, విప్రపూజ సత్ఫలితాన్నిస్తాయి. 
 
ఐదవ రోజు సూర్యమంత్ర జపం చేయాలి. శ్రీకృష్ణుని పూజించాలి. స్వయం పాకం విశేష పుణ్యాన్నిస్తుంది. ఆరవ రోజు సరస్వతీ పూజ చేయాలి. లక్ష్మీ మంత్రజపం చేయాలి. ఏడవ రోజున గౌరీ పూజ చేయాలి. గణేశమంత్ర జపం చేసి ఆరోజు కనీసం ఒకరికైనా భోజనం పెట్టాలి. ఎనిమిదవ రోజున సర్వేశ్వరుని పూజించాలి. కృష్ణ మంత్ర జపం చేయాలి. 
 
తొమ్మిదవ రోజు అనంతుని పూజించాలి. సరస్వతీ మంత్ర జపం చేస్తారు. పదవరోజు నదీపూజలక్ష్మి, హరిహరపూజ, గౌరీపూజ పితృదేవతలకు పిండప్రదానం చేయడం కోసం ఇది విశేష దినం. పదకొండవ రోజు శివమంత్ర జపం చేయాలి. వామనుని పూజించాలి. పంక్తి భోజనం పెట్టాలి. చివరి రోజున శ్రీరామచంద్రుడిని పూజించాలి. రామమంత్రం జపం చేయాలి.