టీటీడీ సేవలు అమోఘం... ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప
విజయవాడ: భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్న సేవలు అమోఘం అని ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కొనియాడారు. శనివారం ఉదయం చినరాజప్ప విజయవాడలో ఏర్పాటు చేసిన టీటీడీ దేవస్థాన నమూన దేవాలయాన్ని సందర్శించారు. ఆయనతోపాటు వైద్య ఆరోగ్యశాఖ మంత
విజయవాడ: భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్న సేవలు అమోఘం అని ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కొనియాడారు. శనివారం ఉదయం చినరాజప్ప విజయవాడలో ఏర్పాటు చేసిన టీటీడీ దేవస్థాన నమూన దేవాలయాన్ని సందర్శించారు. ఆయనతోపాటు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు.
భక్తుల చెంతకు భగవంతుడ్ని తీసుకువచ్చి తరింపజేయడం ఆనందదాయకమని చినరాజప్ప కొనియాడారు. టీటీడీ అందించే సేవలను భక్తులు సద్వినియోగం చేసుకుని కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి ఆశీస్సులతో సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. కృష్ణా పుష్కరాలకు వచ్చిన భక్తులు అధిక శాతం టీటీడీ నమూనా దేవాలయాన్ని సందర్శిస్తున్నారని పేర్కొన్నారు. పుష్కరాలకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం వల్లే... ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా శాంతియుత వాతావరణం నెలకొందని హోం మంత్రి వివరించారు.