Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సేవ‌కు మారు పేరు... పుష్క‌ర వీరులు వీరు, సీఎం చంద్రబాబు సూపర్...(ఫోటోలు)

గురువారం, 18 ఆగస్టు 2016 (16:49 IST)

Widgets Magazine

విజ‌య‌వాడ‌: ఏదో ఆశించి చేసేది సేవ కాదు.. వ్యాపారం. ఏమీ ఆశించ‌కుండా చేసేది దైవ కార్యం. అదే చేస్తున్నారిక్క‌డ కొంద‌రు రియ‌ల్ హీరోలు. కృష్ణా పుష్క‌రాల సంద‌ర్భంగా కొంద‌రు యువ‌తీయువ‌కులు, స్వ‌చ్చంద సంస్థ‌ల వారు అమితంగా భ‌క్తుల‌కు సేవ చేస్తున్నారు. వృద్ధులు, చిన్నారులను జాగ్ర‌త్తగా పుష్క‌ర స్నానానికి తీసుకెళ్లి... పుణ్య స్నానం చేయించి ఘాట్ నుంచి సుర‌క్షితంగా బ‌య‌ట‌కు చేర‌వేయ‌డంతో స‌హా అన్ని ప‌నులు చేస్తున్నారు. 
krishnapushkaraalu
 
స్వ‌చ్చంద సంస్థ‌లే కాదు... కొంద‌రు పోలీసులు కూడా ఈ సేవ‌లో నిమ‌గ్నం కావ‌డం విశేషం. సాధార‌ణంగా పోలీసులు అంటే, అంద‌రికీ భ‌యం. కానీ, ఇక్క‌డ యువ కానిస్టేబుళ్ళు... చ‌క్క‌గా వృద్ధుల‌ను స్వ‌యంగా మోసుకుని వెళ్ళి పుష్క‌ర స్నానం చేయించి, తిరిగి వారిని బ‌య‌ట‌కు తెస్తున్నారు. ఇది ఏదో త‌మ పుష్క‌ర డ్యూటీలా కాక‌, మాన‌వ‌తా దృక్ప‌థంతో కొంద‌రు పోలీసులు చేస్తున్న సేవ కొనియాడ‌ద‌గింది.
krishnapushkaraalu
 
వివిధ సంఘాల వారు, ఆధ్యాత్మిక సేవ సంస్థ‌ల వారు ప్ర‌త్యేకంగా కృష్ణా పుష్క‌రాల‌కు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వ‌లంటీర్లుగా విజ‌య‌వాడ‌కు త‌ర‌లి వ‌చ్చారు. వీరంతా పుష్క‌ర యాత్రికుల‌కు అత్యుత్త‌మ సేవ‌లు స్వ‌చ్చందంగా అందిస్తున్నారు. అంతేగాక‌, కాపు, విశ్వ‌బ్రాహ్మ‌ణ‌, ఆర్య వైశ్య త‌దిత‌ర సంఘాల వారు పుష్క‌ర యాత్రికుల ఆక‌లి తీరుస్తున్నారు. అన్న‌దానం, ప్ర‌సాదాల విత‌ర‌ణ చేస్తూ, శ‌భాష్ అనిపించుకుంటున్నారు. పుష్కరాల నిర్వహణ కూడా అద్భుతంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన భక్తులు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Krishnapushkaralu 2016 News Pushkara Ghats Ap Cm Chandrababu Naidu

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

మొట్టమొదట రాఖీ కట్టించుకున్న అన్న... కట్టిన చెల్లి ఎవరంటే…

శ్రావణ మాసం రాగానే అందరూ ఎదురుచూసే పండుగ రాఖీ. అన్నదమ్ములకు రాఖీ కట్టాలని అక్కచెల్లెళ్ళు ...

news

వై.ఎస్.కు పిండ ప్ర‌దానం... జ‌గ‌న్ మోహన్ రెడ్డికి కంచి స్వామి ఆశీర్వాదం(ఫోటోలు)

విజ‌య‌వాడ‌: ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైసీపీ నాయ‌కుడు జ‌గ‌న్ మోహన్ రెడ్డి కృష్ణా న‌దిలో ...

news

తిరుమలలో స్త్రీలు పువ్వులు ఎందుకు ధరించరో తెలుసా?

తిరుమల శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రదక్షిణం ఆవరణలో పడిపోటునకు ఆనుకొని తూర్పు దిక్కున ఉన్న ...

news

ఎలుకను లేదా చచ్చిన ఎలుకను నోటకరచుకుని పిల్లి ఎదురుపడితే...?

శకునాలను... వాటి ఫలితాలపై భారతీయులకు ఎంతగానో విశ్వాసముంది. శుభకార్యాల నిమిత్తం ...

Widgets Magazine