Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరాలు... చెన్నై తెలుగువారిని పిలవని ప్రభుత్వాలు...

శుక్రవారం, 12 ఆగస్టు 2016 (16:53 IST)

Widgets Magazine
pushkara danam

తెలుగువారు ఎక్కడ ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో ఏదేని పండుగ జరుగుతున్నా, ఉత్సవాలు నిర్వహిస్తున్నా అక్కడ తమ హాజరు ఉంటుంది. తెలుగువారు పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, తమిళనాడులోనూ ఎక్కువగానే ఉన్నారు. ఐతే ఏమిటంటే అనే కదా మీ సందేహం... మరేం లేదు... కృష్ణా పుష్కరాలకు చెన్నై నగరంలో ఉన్న తెలుగు ప్రముఖులకు ఆహ్వానాలు అందలేదట. 
 
రాష్ట్ర విద్యాశాఖమంత్రి గంటా శ్రీనివాసరావు పుష్కరాలకు రావలసిందిగా కోరుతూ రాజకీయ పార్టీలను ఆహ్వానించారట కానీ ఆంధ్రా సోషల్‌ అండ్‌ కల్చరల్‌ అసోసియేషన్ (ఆస్కా), ప్రపంచ తెలుగు సమాఖ్య, అఖిల భారత తెలుగు సమాఖ్య తదితర సంస్థలకు పిలుపు లేదట. కనీసం ఇ-మెయిల్ ద్వారా కూడా ఆహ్వానం పంపలేదట. దీనిపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. కాగా తమిళనాడులో ఏ తెలుగు కార్యక్రమం జరిగినా తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాధినేతలను వీరు ఆహ్వానిస్తుంటారు. మరి అలాంటి తెలుగు సంస్థలకు కనీసం ఆహ్వానాలు అందకపోవడంపై చర్చనీయాంశంగా మారింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

శాస్త్రోక్తంగా జరిగే పెళ్లిళ్ళకు ముక్కోటి దేవతలు - దేవుళ్లు దిగివస్తారట

పెళ్లంటే నూరేళ్ల పంట. పెళ్లిళ్లు స్వర్గంలోనే నిశ్చయింపబడుతాయని పెద్దలు అంటుంటారు. ప్రతి ...

news

పుష్కర ఘాట్లలో నీళ్ళెక్కడ? మోకాళ్ల లోతు నీటిలో మునకెలా? జల్లు స్నానాలతో సరి?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన కృష్ణా పుష్కరాల తొలిరోజునే భక్తులు తీవ్ర ...

news

పుష్కర స్నానం 12 రోజులు... ఏయే రోజులు ఏయే దేవుళ్లను పూజించాలి? చేయాల్సిన జపాలేమిటి?

పుష్కరాలు ప్రారంభమైన తొలి రోజు శుక్రవారం శ్రీ మహావిష్ణువును పూజించాలి. గురుజపం మంత్రం ...

news

పుస్కరాల సందడి లేని రాయలసీమ... పట్టించుకోని సర్కారు - తితిదే

ఆగస్టు 12వ తేదీ నుంచి ప్రారంభమైన కృష్ణానది పుష్కరాలను వందల కోట్ల రూపాయల వ్యయంతో ప్రభుత్వం ...

Widgets Magazine