శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. లోక్ సభ ఎన్నికలు 2024
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 4 జూన్ 2024 (10:12 IST)

Telangana Lok Sabha Election results 2024 Live: తెలంగాణ లోక్ సభ ఎన్నికల ఫలితాలు 2024

Telangana Lok Sabha Election 2024 Results
Telangana (TG) Lok Sabha Election Results 2024: తెలంగాణ లోక్ సభ ఎన్నికల ఫలితాలు 2024 ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. ఈసారి ఎన్నికలు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్‌కి సవాలుగా నిలిచాయి. ముఖ్యంగా రాష్ట్రంలో ఆ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని అధికార పార్టీ కాంగ్రెస్ అంటోంది. దీనితో BRS స్టామినా ఏంటో నిరూపించేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తన కాలుకి శస్త్రచికిత్స చేసుకున్నప్పటికీ బస్సు యాత్ర చేసి ప్రజల వద్దకు వెళ్లారు.

కేవలం 6 నెలల వ్యవధిలో ఎన్నికల ఫలితాలు పాలక పక్షానికి వ్యతిరేకంగా వస్తే అది సీఎం రేవంత్ రెడ్డికి పెద్ద సవాలు కానుంది. అందువల్ల లోక్ సభ ఎన్నికలను ప్రతి పార్టీ ఛాలెంజ్‌గా తీసుకుని శాయశక్తులా ప్రయత్నించారు. రాష్ట్రంలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.  మొత్తమ్మీద ఈసారి ఎన్నికల ఫలితాలు అత్యంత ఉత్కంఠను కలిగించనున్నాయి. ఈ నేపధ్యంలో Webdunia Telugu మీకోసం Telangana Lok Sabha Election 2024 Results Live Updates అందిస్తోంది.