నేను నీ అమూల్యమైన వజ్రాన్ని.... నేనే నీకు ఎందుకూ కొరగాని బండరాయిని
ప్రియా.... నేను నీ అమూల్యమైన వజ్రాన్ని నేనే నీకు ఎందుకూ కొరగాని బండరాయిని నేను నీకు అత్యంత సంతోషాన్ని నేనే నీ గుండెలు పిండేసి దుఃఖాన్ని
ప్రియా....
నేను నీ అమూల్యమైన వజ్రాన్ని
నేనే నీకు ఎందుకూ కొరగాని బండరాయిని
నేను నీకు అత్యంత సంతోషాన్ని
నేనే నీ గుండెలు పిండేసి దుఃఖాన్ని
నేను నీ తీపి గుర్తును
నేనే నీకు చేదు నిజాన్ని
నేను నీ హృదయ సవ్వడిని
నేనే నీ గుండెల్లో భారాన్ని
నీ కంటిపాపలో నేనే
నీ కంటిలో నలుసునూ నేనే
నీ తీయనైన కలను నేను
నీ ఉలికిపాటు నిద్రనూ నేనే
నేను నీ వెన్నెల వెలుగును
నేనే నీకు అమవాస్య చీకటిని
నేను నీ ఆనందాల హరివిల్లును
నేనే నీ పొదరిల్లులో లేని కిరణాన్ని
నేను శీతాకాలపు వెచ్చదనాన్ని
నేనే నీకు ఎండాకాలం వడగాలిని
నేను చల్లటి మలయమారుతాన్ని
నేనే నీకు కొండలే రగిలే గాలిని
నేను నీ హృదయ స్పందనను
నేను నీ శ్వాసను
నేను నీ కన్నుల్లో రూపాన్ని
నేను నీ తనువులో దాగున్న అణువణువును
నీకు రేయిని నేనే
పగలునూ నేనే
నీ సర్వస్వాన్ని నేనే...