నీ నవ్వు మల్లె పువ్వుల తావి..?

Last Updated: బుధవారం, 27 మార్చి 2019 (16:37 IST)
నీ నవ్వు మల్లె పువ్వుల తావి..
నీ మోము నిండు జాబిలి రూపు..
నీ చూపు పేరు మారుని తూపు..
నీ ఓర చూపు నా మది నూపు..

నీ నీడ నాకు వెన్నెల మేడ
నీ మాట తీరు వేదన బాపు
నీ వన్నె పైడి కొండను గేర
నీ మేను తీయ మామిడి తోపు

నీ రాక కోటి ఆశల తేరు
నీ పైట గాలి కోర్కెను లేపు
నీ వేడి వేడి కౌగిలిలోన
నీ పొందు విందు స్వర్గము జూపు..
నీ సన్నిధానపు కాపు..దీనిపై మరింత చదవండి :