సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. ప్రేమ కవితలు
Written By
Last Updated : మంగళవారం, 4 డిశెంబరు 2018 (15:42 IST)

ప్రేమ అంటే ఏమిటో తెలుసా..?

ప్రేమించుకునే జంటలకు కొదవే లేదు. అదే సమయంలో ప్రేమ అంటే తెలియనివారు కూడా ఉన్నాయి. ఇలాంటి వారికోసం.. కొన్ని ప్రేమ సూక్తులు.
 
ప్రేమ అంగల్లో దొరికే వస్తువు కాదు. అది స్వతహాగా మనసులో పుట్టుకొచ్చే పుట్టుమచ్చలాంటిది.
ప్రేమంటే హృదయాన్ని పారేసుకోవటం కాదు. నువ్వు లేనప్పుడు నవ్వుని, నువ్వున్నప్పుడు కాలాన్నీ పారేసుకోవడం.
 
పెళ్ళయిన తర్వాత జీవిత భాగస్వామిని ప్రేమించడం అన్నింటికన్నా ఆరోగ్యకరమైన ప్రేమ.
ప్రేమించడానికి హృదయం ఉండాలి. ప్రేమింపబడడానికి వ్యక్తిత్వం ఉండాలి.
 
ప్రేమ వేదం లాంటిది. చదవగలిగితే పరిపూర్ణతను ఇస్తుంది. ఒక మనిషి ఇంకొక మనిషిని ప్రేమించేలా చేయడం భగవంతుడికి కూడా సాధ్యం కాదు. జీవితం పువ్వులాంటిది.. అందులోని మకరందమే ప్రేమ.
 
ప్రేమ శత్రువులను కూడా మిత్రులుగా మారుస్తుంది. ప్రేమించడం పాపం కాదు. ఎందుకంటే అది పెరిగేది కడుపులో కాదు, హృదయంలో... ఈ ప్రపంచంలో ప్రేమకు కూడా ఏదో వ్యతిరేకత, అర్హత ఉండాలంటే ఇంత మంది ప్రేమించేవారు కాదు. ప్రేమించబడేవారు కాదు.
 
ఇష్టం ప్రేమగా మారాలంటే దానికి గౌరవం తోడవ్వాలి. కళ కన్నా ప్రేమ గొప్పది. ప్రేమ కన్నా జీవితం గొప్పది. ప్రేమ కోపాన్ని చంపుతుంది. చిరునవ్వుని పుట్టిస్తుంది.