శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : శనివారం, 29 నవంబరు 2014 (18:48 IST)

భాగస్వామి డిప్రెషన్‌లో ఉంటే.. మీ ఇష్టానికి తగ్గట్లు..?

భాగస్వామి డిప్రెషన్‌లో ఉంటే మీ ఇష్టానికి తగ్గట్లు నడుచుకోవాలని ప్రయత్నించకండి. ఒత్తిడిలో ఉంటే భాగస్వామిని ప్రశాంతంగా ఉండనివ్వండి. చెప్పేవి వినాలని వత్తిడి చేయకూడదు. అలాగే తరచూ ఏదో మాట్లాడుతూ ఉండకండి. ఒత్తిడిలో ఉంటే ప్రశాంతంగానే సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ముందుకు రండి. ఏదైనా చెప్పాలనుకొన్నప్పుడు  చేతుల పట్టుకొని, నిధానంగా వినడానికి ప్రయత్నించండి. భాగస్వామిని ఒత్తిడి నుంచి అధిగమింప చేయాలంటే.. ఇదే చక్కని మార్గం. 
 
భాగస్వామి డిప్రెషన్‌లో ఉన్నప్పుడు తను వెంటే ఉండండి. పురుషుల్లో ఈగో చాలా డిఫికల్ట్‌గా ఉంటుంది. కాబట్టి అతను పూర్తిగా డిప్రెషన్‌లో ఉన్నప్పుడు అతనికి సపోర్ట్‌గా ఉండాలి. ఒక వేళ అతను మీతో చెప్పుకొని ఏడవగలిగినప్పుడు ఓదార్చే ధైర్యం మీలో నింపుకోవాలి. అతనికి నీకు తోడు నేనున్నానంటూ ధైర్యం చెప్పాలి. డిప్రెషన్‌కు సరైన కారణం కనుక్కొని అందుకు తగ్గట్లు ప్రవర్తించండి. ఇలా చేస్తే భాగస్వామిని ఒత్తిడి నుంచి ఈజీగా బయటికి తీసుకురావచ్చునని మానసిక నిపుణులు అంటున్నారు.