ప్రేమలో పడకుండా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో కండి!
ప్రస్తుతం ఆధునికత పేరుతో యువత చాటింగ్, డేటింగ్ అంటూ యమ స్పీడ్‌లో ఉన్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్ల పుణ్యమా అంటూ యువత స్నేహ వలయం కాస్త బ్రాడ్‌గా పెరిగిపోతోంది. ఈ ఫ్రెండ్‌షిపే మెల్లమెల్లగా ప్రేమగా మారిపోతోంది. ఆ తర్వాత ఆ ప్రేమ చిరస్థాయిగా ఉండటం డౌట్‌గానే మిగిలిపోతోంది. ఈ నేపథ్యంలో పెళ్ళికి ముందు ప్రేమలో పడకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటిస్తే సరిపోతోందని మానసిక నిపుణులు అంటున్నారు.
అవేంటంటే..
మీ దృష్టిని మరల్చండి. ప్రేమను ఎక్స్ ప్రెస్ చేసే వ్యక్తికి మీ మనస్సును కంట్రోల్ చేసే అవకాశం ఇవ్వకండి. అతని ఆలోచనలను మీలో రానీయకుండా చూసుకోండి. ఆ ఆలోచనలకు బ్రేక్ వేయాలంటే కెరీర్, చదువుల పట్ల దృష్టి మరల్చండి.
ప్రేమను ఎక్స్ ప్రెస్ చేసిన వ్యక్తితో మరీ ఎక్కువగా స్నేహం చేయకండి. అటువంటి వ్యక్తులతో మీరు కొంచెం దూరంగా ఉంటూ, వారిని దూరం పెట్టండి. మరీ ముఖ్యంగా లేట్ నైట్ మెసేజ్‌లు లేదా ఫోన్ కాల్స్‌తో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోవడం నివారించండి.
మనలో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపాలుంటాయి. మిమ్మల్ని ఎవరైనా ప్రేమించడానికి ప్రయత్నిస్తున్నా, ప్రేమను వ్యక్తపరిచినా, మీకు ఇష్టం లేకపోతే వారిలోని లోపాలను వెతికి చెప్పండి.
ఇతరుల పట్ల ఆకర్షితులు కాకండి. అందంగా ఫన్నీగా కనిపిస్తే వెంటనే వారి ప్రేమలో పడిపోకండి. ఇంకా ప్రేమను నిరాకరించాలంటే మీకు నచ్చిన వ్యక్తుల పట్ల దృష్టి మళ్ళించండి. ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తేనే మీకు ఇష్టం లేని వారిని ప్రేమించకుండా ఎస్కేప్ కావొచ్చునని సైకాలజిస్టులు చెబుతున్నారు.