శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. చిట్కాలు
Written By ivr
Last Updated : శుక్రవారం, 20 మే 2016 (20:53 IST)

ఆఫీస్‌లో లవ్, రొమాన్స్... ఫలితం ఇలాగే ఉంటుందట...

ప్రేమ ఎప్పుడు పుడుతుందో ఎవరికీ అర్థం కాదు. ప్రేమలో పడిన వారిని సైతం ఎందుకు ప్రేమలో పడిపోయావంటే చెప్పలేరు. ఐతే చాలా మంది ప్రేమికులు ప్రేమికులుగానే ఆగిపోతూ ఉంటారు. ఆ తర్వాత పెద్దల మాటకు ఎదురు చెప్పలేక ఎ

ప్రేమ ఎప్పుడు పుడుతుందో ఎవరికీ అర్థం కాదు. ప్రేమలో పడిన వారిని సైతం ఎందుకు ప్రేమలో పడిపోయావంటే చెప్పలేరు. ఐతే చాలా మంది ప్రేమికులు ప్రేమికులుగానే ఆగిపోతూ ఉంటారు. ఆ తర్వాత పెద్దల మాటకు ఎదురు చెప్పలేక ఎవరికి వారు విడిపోయి వేర్వేరు పెళ్లిళ్లు చేసుకుని ఆ తర్వాత జీవితాంతం ఆ ప్రేమను తలుచుకుంటూ బాధపడిపోతుంటారు. మళ్లీ కలవాలనుకున్నా కట్టుబాట్లు, సామాజిక పరిస్థితుల కారణంగా అలాగే లోలోన కుమిలిపోతుంటారు. 
 
కానీ డిగ్రీలు చేసి, ఉద్యోగాల్లో స్థిరపడ్డాక ఉద్యోగం సంపాదించాక ప్రేమలో పడేవారి లవ్ 100 పర్సెట్ సక్సెస్ అవుతుందని ప్రేమికుల పైన పరిశోధనలు చేసినవారు చెపుతున్నారు. ముఖ్యంగా కార్యాలయంలో ప్రేమలో పడేవారికి ఆర్థిక స్వేచ్చ, ఆలోచన, భవిష్యత్తుపై సరైన అవగాహన ఉండటంతో ప్రేమ దృఢంగా ఉండటమే కాకుండా పెళ్లికి దారితీసే అవకాశాలు చాలా మెండుగా ఉంటాయని చెపుతున్నారు. 
 
ఇలా ఆఫీసులో పనిచేస్తూ ప్రేమికులయినవారి విషయాన్ని పరిశీలించినప్పుడు దాదాపు 51 శాతం మంది పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడినట్లు తేలింది. ఇక కాలేజీ స్థాయి ప్రేమలు, మిత్రులుగా పరిచయమై ప్రేమికులుగా మారినవారిలో ఈ శాతం కేవలం 37 మాత్రమే అని తేలింది. కాబట్టి కార్యాలయంలో ప్రేమ స్ట్రాంగ్ అన్నమాట.