శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : గురువారం, 9 అక్టోబరు 2014 (17:49 IST)

నిజమైన ప్రేమకు చిహ్నాలేవి.. బాధకు అలవాటుపడండి!

భార్యాభర్తలు, ప్రేమికుల మధ్య నిజమైన ప్రేమానుబంధానికి చిహ్నాలేంటో తెలుసుకోవాలా.. అయితే ఈ స్టోరీ చదవండి. భాగస్వామిపై నిజమైన ప్రేమ ఉందని నిరూపించుకోవడానికి.. బంధాన్ని బలోపేతం చేసేందుకు ముందుగా చేయాల్సిందల్లా త్యాగం. త్యాగానికి అలవాటు పడాలి. భాగస్వామి ఆనందం లేదా శ్రేయస్సు కోసం.. వారు సరైన గుర్తింపు ఇచ్చినా, ఇవ్వకపోయినా.. త్యాగమనేది అలవరుచుకోవాలి.  
 
భాగస్వామిని సంతోషపరచాలంటే.. ప్రతి విషయాన్ని సాధ్యపడే విధంగా ప్రయత్నించాలి. భాగస్వామి చెప్పిన విషయాలను చేయడంతో పాటు వారికి అవసరమయ్యే పనుల్ని చేసేందుకు ప్రయత్నాలు చేస్తుండాలి. 
 
అలాగే భాగస్వామిని బాధపెడుతున్నామనే ఆలోచన ఉండాలి. నిజమైన ప్రేమలో ఉన్నప్పుడు వారిని మానసికంగా, శారీరకంగా బాధపెట్టడం ఊహించకూడదు. అందుకే కష్టాల్లో ఉన్నప్పుడు వారిని ఆదుకునే ప్రయత్నం చేయాలి. అనునయించాలి. ఓదార్చటానికి సిద్ధపడాలి. భాగస్వామికోసం సంతోషాలకే పరిమితం కాకుండా బాధలు పడటానికి కూడా సిద్ధంగా ఉండాలి.