శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. చిట్కాలు
Written By
Last Updated : శుక్రవారం, 3 మే 2019 (17:46 IST)

పెళ్లైన కొత్తలో ఎక్కడ తగ్గాలో తెలిస్తే? (video)

మీకు పెళ్లైంది... అయితే ఇలా వుండండి.. అంటున్నారు.. సైకాలజిస్టులు. కొత్తగా పెళ్లైన దంపతులకు ఇష్టాఇష్టాలు వేర్వేరుగా వుండొచ్చు. కానీ ఇద్దరికీ నచ్చే విషయాలు కొన్ని వరకైనా వుంటాయి. అలా ఇద్దరికీ నచ్చే అంశంపై మాట్లాడుకుంటే ఆనందాన్నిస్తుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడం.. భాగస్వామిలో వున్న మంచి విషయాలను గుర్తించాలి. వాటి గురించి మాట్లాడటం చేయాలి. 
 
పాజిటివ్ విషయాలను గురించి ఇద్దరి మధ్య చర్చ వుంటే ఆ దంపతులు అన్యోన్యంగా జీవిస్తారు. అలా కాకుండా నెగటివ్ అంశాలపై ఇద్దరి మధ్య చర్చ వస్తే మాత్రం ఆ దంపతుల మధ్య వాగ్వివాదాలు తప్పనిసరి. కొత్తగా పెళ్లైన దంపతులు ఎదుటి వారి కళ్లలోంచి చూసి మాట్లాడగలగాలి. అది ఎదుటి వారి పట్ల సానుభూతి నింపుతుంది. మనసుల మధ్య సాన్నిహిత్యం ఏర్పడుతుంది. 
 
దంపతులు జీవితంలోకి అడుగుపెట్టాక.. ఇద్దరూ సహకరించుకోవాలి. ఏపనైనా ఇద్దరి కలిసి చేస్తే.. ఆ దంపతుల మధ్య సాన్నిత్యం పెరుగుతుంది. అలా ఒకరికొకరు సహకరించుకోవడం.. ఒకరికొకరు కృతజ్ఞతలు చెప్పుకోవడం మరిచిపోకూడదు. ఇది ఇద్దరిలో అభిమానాన్ని నింపుతుంది. అనివార్యంగా జరిగిపోయిన వాటికి నిందించడమో, ఆగ్రహించడమో చేయకుండా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అది దాంపత్యాన్ని శక్తివంతం చేస్తుంది.
 
కోపంతో భాగస్వామి వున్నారని తెలిస్తే.. కాస్త తగ్గడం మంచిది. కోపం తగ్గిన తర్వాత జరిగిన విషయాన్ని ఏకరువు పెట్టండి. గట్టిగా మాట్లాడటం కాకుండా.. ప్రశాంతంగా మాట్లాడటం చేయాలి. అలా చేస్తే భార్యాభర్తల మధ్య అనుబంధం పెరుగుతుంది. ఇలా ఒకరినొకరు సర్దుకుని ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు అనే మాటను గుర్తించుకుంటే.. దంపతులు కూడా జీవితాన్ని జయించవచ్చు.