మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : గురువారం, 18 మే 2017 (13:43 IST)

కౌగిలింతలో అంత హాయి వుందా..? ''బియర్‌ హగ్‌'' గురించి తెలుసా? ప్రేమికులకు చెప్పక్కర్లేదు..

కౌగిలింతతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పరిశోధనలు ఎన్నో తేల్చాయి. ఆప్యాయతతో కూడిన కౌగిలి ఒత్తిడిని దూరం చేస్తుందని.. మనస్సుకు నచ్చిన వారు ఆప్యాయంగా కౌగిలిలోకి తీసుకుంటే.. ఎలాంటి మానసిక ఆందోళనైనా పటా

కౌగిలింతతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పరిశోధనలు ఎన్నో తేల్చాయి. ఆప్యాయతతో కూడిన కౌగిలి ఒత్తిడిని దూరం చేస్తుందని.. మనస్సుకు నచ్చిన వారు ఆప్యాయంగా కౌగిలిలోకి తీసుకుంటే.. ఎలాంటి మానసిక ఆందోళనైనా పటాపంచలవుతుందని అందరికీ తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్ చూస్తే అమ్మ కౌగిలికి ఉన్న మహిమ ఏంటో తెలుసుకోవచ్చు. 
 
అలాగే కౌగిలింతల్లో పలు రకాలున్నాయట. అవేంటంటే..? బియర్ హగ్ గురించి ముందు తెలుసుకుందాం.. ఈ బియర్ హగ్‌కు ఎలాంటి వారైనా ఉక్కిరి బిక్కిరి కాక తప్పదట. ఎన్నాళ్లో వేచి చూసిన వారు.. కళ్లెదుట వచ్చి నిలబడితే.. ఆ ఆనందాన్ని పట్టలేక.. అమాంతంగా వారిని కౌగిలించుకుంటారు. దీన్నే బియర్ హగ్ అంటారు. ఈ హగ్‌లో ఎదుటివారి చుట్టూ చేతులు రెండూ చుట్టేసి, వారిని గాఢంగా హత్తుకుని కౌగిలిలో బంధిస్తారు. ఆత్మీయతతో అందించే ఇలాంటి కౌగిలిని అందరూ స్వాగతిస్తారు. ప్రేమికుల విషయంలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
 
ఇలాంటి కౌగిలింతలు స్నేహితుల మధ్య కూడా ఉంటుంది. వెనకనుంచి వచ్చి అమాంతంగా హత్తుకునే పద్ధతిని ఫ్రెండ్లీ హగ్ అంటారట. ఇలాంటి కౌగిలితో పలకరించేవారు మంచి స్నేహితులుగా గుర్తింపు పొందుతారని మానసిక నిపుణులు అంటున్నారు. ఒక వ్యక్తిని నమ్మి.. మృదువుగా ఆలింగనం చేసుకుని వారి భుజంపై తలవాల్చే కౌగిలి.. నమ్మకం కలిగి వారి వద్దే ఉంటుందట. ఆత్మీయంగా దగ్గరకు తీసుకునే కౌగిలిని పొలైట్ హగ్ అంటారు. ఇది స్నేహితులు, తల్లిదండ్రులు, పిల్లల మధ్య చోటుచేసుకుంటాయి.