గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. చిట్కాలు
Written By ivr
Last Modified: బుధవారం, 12 ఏప్రియల్ 2017 (14:46 IST)

అమ్మాయిలకు ఆ రంగు దుస్తులు వేసుకున్న అబ్బాయిలంటే ఇష్టమట...

సాధారణంగా ఎరుపు రంగు ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. ఎందుకంటే ఇది మనసుకు, మెదడుకు ఉత్తేజాన్నిస్తుంది. ఈ రంగు సాహసం, త్యాగం, శృంగారం, శక్తి, కోపాలకు ప్రతీక. నలుగురిలో త్వరగా ఆకర్షించబడాలంటే ఈ రంగు బాగా ఉపయోగపడుతుంది. సరే ఇదంతా...! ఎరుపు రంగుకు ఉన్న ప్రత్య

సాధారణంగా ఎరుపు రంగు ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. ఎందుకంటే ఇది మనసుకు, మెదడుకు ఉత్తేజాన్నిస్తుంది. ఈ రంగు సాహసం, త్యాగం, శృంగారం, శక్తి, కోపాలకు ప్రతీక. నలుగురిలో త్వరగా ఆకర్షించబడాలంటే ఈ రంగు బాగా ఉపయోగపడుతుంది. సరే ఇదంతా...! ఎరుపు రంగుకు ఉన్న ప్రత్యేకత...! ఇది పక్కన పెడితే...! మామూలుగా అబ్బాయిలు అమ్మాయిల్ని ఆకర్షించడానికి నానా ఇబ్బందులు పడుతుంటారు.
 
కొందరైతే ఖరీదైన నగలు, బైకులు ఇలా రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. మరికొందరైతే అమ్మాయిలకి చాక్లెట్లు, పూలు, గిఫ్టులు ఇచ్చి కాకా పట్టాలని ట్రై చేస్తుంటారు. అయితే అబ్బాయిలు ఇక నుంచి ఇటువంటి పాట్లు పడక్కర్లేందటున్నాయి తాజా పరిశోధనలు. అసలు విషయం ఏంటంటారా...? మరి చదవండి....!
 
అమ్మాయిలను ఆకర్షించాలంటే ఎర్రటి దుస్తులు వేసుకుంటే చాలని కొత్తగా జరిపిన పరిశోధనలో వెల్లడైంది. "స్త్రీలకు ఎరుపు రంగు అంటే ఓ శృంగారభరితమైన ఆలోచన" అని రోచెస్టర్, మునిచ్ కళాశాలలకు చెందిన మనస్తత్వ శాస్త్రవేత్త ఆండ్రూ ఎల్లియోట్ తెలిపారు. అంతేకాకుండా తమ పరిశోధనలో ఎరుపు రంగు, శృంగారం ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నట్లు కూడా ఆయన అన్నారు.
 
అమెరికా, ఇంగ్లాండ్, జెర్మనీ, చైనా దేశాలలోని అమ్మాయిలు ఇతర రంగుల దుస్తులు వేసుకున్న అబ్బాయిలతో పోలిస్తే ఎరుపు రంగు వేసుకున్న వారినే ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు తేలింది. టీషర్టు ధరించిన ఓ అబ్బాయి బ్లాక్ అండ్ వైట్ ఫోటో(బ్యాక్‌గ్రౌండ్ ఎరుపు లేదా తెలుపు)లను 35 మంది యువతులకు చూపించగా, నైన్-పాయింట్ స్కేలు ఆధారం చేసుకొని వారు మూడు ప్రశ్నలను అడిగారు. 
 
ఈ వ్యక్తి ఎంత ఆకర్షణీయంగా ఉన్నాడని మీరు అనుకుంటున్నారు? చూడటానికి ఈ వ్యక్తి ఎంత ప్రశాంతంగా ఉన్నాడు? ఒకవేళ నేను అతడ్ని ముఖాముఖి కలిస్తే అతడు ఆకర్షణీయంగా ఉన్నాడని ఆలోచిస్తాను? ఈ ప్రశ్నలకు సమాధానంగా ఎరుపు బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫోటోకి తెలుపు బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫోటోకన్నా ఒక పాయింట్ ఎక్కువగా నైన్-పాయింట్ స్కేలుపై నమోదయ్యింది.
 
ఇదే విషయమై ఇంకొక పరిశోధనలో ఒక ఎరుపు రంగు షర్టు ధరంచిన వ్యక్తి ఫోటోను, మరొక ఆకుపచ్చని రంగు షర్టు ధరించిన ఫోటోను అమ్మాయిలకు చూపించగా అందులో 55 మంది ఎరుపు రంగు ధరించిన వ్యక్తికే ఓటు చేశారు. స్త్రీల విషయంలో ఎరుపు రంగుకు వివిధ సాంప్రదాయలలో ఓ ప్రత్యేకత ఉంటుంది. అదే మగవారికి మాత్రం ఇది స్థిరంగా ఉంటుంది.