బుధవారం, 22 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. మహాశివరాత్రి
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (21:10 IST)

మహా శివరాత్రి 2022: ఉపవాసం వుంటే ఇవి తినవచ్చు...

మహా శివరాత్రి మార్చి 1న జరుపుకుంటారు. ఉపవాసం వుండేవారు.. పెరుగు, బర్ఫీతో పాటు పాల ఆధారిత వంటకాలు తీసుకోవచ్చు. పాలతో పాటు కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. 
 
ఉపవాసం ఉన్నప్పుడు, పండ్లు తప్పనిసరిగా తీసుకోవాలి. అయితే ఉప్పును మాత్రం ఆహారంలో తీసుకోకూడదు. డ్రైఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా ఆకలి నుంచి తప్పించుకోవచ్చు.  
 
బంగాళాదుంపలు మహా శివరాత్రి ఉపవాసం సమయంలో తినడానికి ఉత్తమ ఆహార పదార్థాలలో ఒకటి, బంగాళాదుంపలను ఉడకబెట్టి, వాటిని కోసి పెరుగుతో పాటు తినండి. 
 
ఉపవాసం లేదా వ్రతం సమయంలో సగ్గుబియ్యంతో కిచిడి లేదా స్వీట్స్ తీసుకోవచ్చునని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.