శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. మహాశివరాత్రి
Written By JSK
Last Updated : సోమవారం, 7 మార్చి 2016 (14:21 IST)

పుణ్య స్నానం చేద్దాం అంటే... దుర్గాఘాట్లో దుర్గంధం, బెజ‌వాడ‌లో భ‌క్తుల అస‌హ‌నం

విజయవాడ :  బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ స‌న్నిధిలో భ‌క్తులు తీవ్ర అస‌హ‌నంతో ఉన్నారు. శివ‌రాత్రి ప‌ర్వ‌దినాన పుణ్య స్నానాలు చేయాల‌ని భ‌క్తులు వేల సంఖ్య‌లో త‌ర‌లి వ‌చ్చారు. తీరా ఇక్క‌డ‌ కృష్ణా న‌దిలో స్నానాలు చేద్దామంటే, దుర్గఘాట్ వద్ద నీరు అడుగు అంటింది... పుణ్య స్నానాలకు మురుగు నీరే దిక్క‌వుతోంది. 
 
స్నాన‌ఘాట్ల వ‌ద్ద నీరు దుర్గంధం రావ‌డంతో భ‌క్తులు జల్లు స్నానాలతో సరిపెట్టుకుంటున్నారు. ఒక ప‌క్క కృష్ణ‌లో పూడిక తీయిస్తున్నామ‌ని, అందుకే నీరు లేక‌...మురుగు వాస‌న వ‌స్తోంద‌ని అధికారులే అంగీక‌రిస్తున్నారు... ఈ శివ‌రాత్రికి ఎలాగోలా స‌ర్దుకుపోవాల‌ని చెపుతున్నారు.