గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 జులై 2023 (17:34 IST)

మణిపూర్‌ ఘటన.. ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

మణిపూర్‌లో ఇద్దరు మహిళలపై జరిగిన దారుణానికి సంబంధించిన కేసులో ప్రధాన నిందితుడిని అరెస్టు చేసినట్లు సమాచారం. గత మే నెలలో మణిపూర్‌లో ఇద్దరు మహిళలను గ్యాంగ్ వివస్త్రను చేసి అత్యాచారానికి పాల్పడిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారి సంచలనం రేపింది. 
 
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తుండగా.. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న ఒక్క నేరస్థుడు కూడా తప్పించుకోలేడని హామీ ఇస్తున్నాను. అంటూ పేర్కొన్నారు. 
 
ఈ పరిస్థితిలో, మణిపూర్ మహిళలపై జరిగిన క్రూరమైన ఘటనకు కారణమైన ప్రధాన నిందితుడిని అరెస్టు చేశామని, హెరాదాస్ అనే ప్రధాన నిందితుడని మణిపూర్ పోలీసులు తెలియజేశారు.