శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎంజీ
Last Updated : శనివారం, 30 అక్టోబరు 2021 (12:28 IST)

దేశంలో కొత్తగా 14వేల కరోనా కేసులు.. 549 మరణాలు

దేశంలో కరోనా కేసుల నమోదులో స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశంలో 14,313 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి.

కరోనా మహమ్మారి కారణంగా 549 మంది మరణించారు. కరోనా బారి నుంచి మరో 13,543 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,61,555 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. ప్రస్తుతం రికవరీ రేటు 98.19 శాతంగా ఉందని తెలిపింది. మరోవైపు దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 105.43 కోట్ల మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయినట్లు బులెటిన్‌లో పేర్కొంది..