సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 23 ఏప్రియల్ 2018 (11:51 IST)

14 ఏళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారం.. బీజేపీ మద్దతుదారుడి అరెస్ట్

దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. నిర్భయలాంటి చట్టాలొచ్చినా.. మానవ మృగాలు రెచ్చిపోతున్నారు. 14 ఏళ్ల బాలికపై 54 ఏళ్ల బీజేపీ మద్దతుదారుడైన వ్యాపారి అత్యాచారానిరి పాల్పడ్డాడు. ఈ ఘటన త్రిప

దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. నిర్భయలాంటి చట్టాలొచ్చినా.. మానవ మృగాలు రెచ్చిపోతున్నారు. 14 ఏళ్ల బాలికపై 54 ఏళ్ల బీజేపీ మద్దతుదారుడైన వ్యాపారి అత్యాచారానిరి పాల్పడ్డాడు. ఈ ఘటన త్రిపురలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బీజేపీ నేతగా మనోజ్ డెబ్ (54) తనను తాను ప్రచారం చేసుకున్నాడు. 
 
గత ఫిబ్రవరి 11న చంప్లాయ్‌లోని తన ఫామ్ హౌస్‌లో మైనర్ బాలిక (14)పై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ విషయం బయటికి చెప్తే చంపేస్తానని హెచ్చరించాడు. అంతటితో ఆగకుండా నాలుగు సార్లు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
గతవారం ఫామ్‌హౌస్‌కు రమ్మని బెదిరించడంతో బాధితురాలు స్నేహితురాలి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.